Telugu Global
MOVIE UPDATES

ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అవుతాడని అనుకోలేదు

ఈమాట ఎవరో అంటే పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు అంటే మాత్రం ఒకింత ఆశ్చర్యపోవాల్సిందే. అవును.. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు చేసిన కామెంట్స్ ఇవి. ఇంతకీ ఆయన ఎందుకీ మాట అనాల్సి వచ్చింది. ప్రభాస్ హీరోగా అడుగుపెట్టి ఈరోజుకి సరిగ్గా 20 ఏళ్ళు. ఈ 20 ఏళ్ల ఆనందాన్ని సంబరంగా జరుపుకున్నారు అభిమానులు. రెబెల్ స్టార్ కృష్ణంరాజు ఆధ్వర్యంలో ఆయన నివాసంలో సెలెబ్రేషన్స్ జరిగాయి. ప్రభాస్ ను హీరోగా పరిచయం చేస్తూ, ఈశ్వర్ సినిమాను […]

ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అవుతాడని అనుకోలేదు
X

ఈమాట ఎవరో అంటే పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు అంటే మాత్రం ఒకింత ఆశ్చర్యపోవాల్సిందే. అవును.. ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు చేసిన కామెంట్స్ ఇవి. ఇంతకీ ఆయన ఎందుకీ మాట అనాల్సి వచ్చింది.

ప్రభాస్ హీరోగా అడుగుపెట్టి ఈరోజుకి సరిగ్గా 20 ఏళ్ళు. ఈ 20 ఏళ్ల ఆనందాన్ని సంబరంగా జరుపుకున్నారు అభిమానులు. రెబెల్ స్టార్ కృష్ణంరాజు ఆధ్వర్యంలో ఆయన నివాసంలో సెలెబ్రేషన్స్ జరిగాయి.

ప్రభాస్ ను హీరోగా పరిచయం చేస్తూ, ఈశ్వర్ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు జయంత్ సి పరాన్జీ, నిర్మాత అశోక్ కుమార్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు కృష్ణం రాజు. ఈ సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు.

“ప్రభాస్ హీరోగా పరిచయం అయి అప్పుడే 20 ఏళ్ళు గడచిపోయాయా అన్న సందేహం కలుగుతుంది. ప్రభాస్ మొదటి సినిమా చూశాక తప్పకుండా పెద్ద హీరో అవుతాడని అనుకున్నాం కానీ ఎవరు ఊహించని విధంగా ఇలా పాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతాడని అనుకోలేదు.

దీనికి అతని శ్రమ, పట్టుదల కారణం. వీటికి అభిమానుల అండదండలు తోడయ్యాయి. ప్రభాస్ ని చుస్తే చాలా ఆనందంగా ఉంది. ఒక నటుడిగానే కాకుండా సాటివారి పట్ల సహాయం చేసే గొప్ప గుణం ఉంది. ప్రభాస్ ఇంకా ఇలాగే మరింత ఎత్తుకు ఎదగాలని మంచి విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను”

ఇలా ప్రభాస్ పై తనకున్న ప్రేమను, ప్రభాస్ ఉన్నతిని చూసి తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు కృష్ణంరాజు. 20 ఏళ్ల కిందట సరిగ్గా ఇదే రోజు రామానాయుడు స్టుడియోస్ లో ప్రభాస్ ను హీరోగా పరిచయం చేస్తూ ఈశ్వర్ సినిమాను మొదలుపెట్టారు. ప్రభాస్ పై తొలిసారి కృష్ణంరాజు క్లాప్ కొట్టిన రోజు ఇది.

First Published:  28 Jun 2022 8:30 AM GMT
Next Story