Telugu Global
MOVIE UPDATES

పక్కా కమర్షియల్ సెన్సార్ టాక్

గోపీచంద్, రాశి ఖన్నా హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా పక్కా కమర్షియల్. వీళ్లిద్దరి జంటగా వస్తున్న మూడో సినిమా ఇది. ఇంతకుముందు జిల్, ఆక్సిజన్ సినిమాల్లో కలిసినటించారు. ఇప్పుడు మూడోసారి పక్కా కమర్షియల్ అంటున్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. 152 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ సభ్యులు. సెన్సార్ సభ్యుల ఇన్ సైడ్ టాక్ ఎలా ఉందంటే.. ఈ సినిమాలో కామెడీ ఎంత ఉందో, యాక్షన్ కూడా […]

పక్కా కమర్షియల్ సెన్సార్ టాక్
X

గోపీచంద్, రాశి ఖన్నా హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా పక్కా కమర్షియల్. వీళ్లిద్దరి జంటగా వస్తున్న మూడో సినిమా ఇది. ఇంతకుముందు జిల్, ఆక్సిజన్ సినిమాల్లో కలిసినటించారు. ఇప్పుడు మూడోసారి పక్కా కమర్షియల్ అంటున్నారు.

తాజాగా ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. 152 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ సభ్యులు.

సెన్సార్ సభ్యుల ఇన్ సైడ్ టాక్ ఎలా ఉందంటే.. ఈ సినిమాలో కామెడీ ఎంత ఉందో, యాక్షన్ కూడా అంతే ఉందంట. ఫస్టాఫ్ లో కామెడీకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చిన దర్శకుడు, సెకెండాఫ్ లో మాత్రం యాక్షన్, కొద్దిపాటి ఎమోషన్ చూపించాడట.

సత్యరాజ్, గోపీచంద్ మధ్య వచ్చే సన్నివేశాలు హార్ట్ టచింగ్ గా తెరకెక్కాయట. ఇక క్లయిమాక్స్ కు ముందు ఇచ్చిన చిన్న సందేశం కూడా బాగుందని చెబుతున్నారు సెన్సార్ సభ్యులు.

సెన్సార్ పూర్తవ్వడంతో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది. ప్రస్తుతానికైతే బుకింగ్స్ లో పెద్దగా జోరు కనిపించలేదు. బుధ, గురువారానికి బుకింగ్స్ ఊపందుకుంటాయని భావిస్తున్నారు. ప్రేక్షకులకు ఈ సినిమాను దగ్గర చేసేందుకు, బుకింగ్స్ పెంచేందుకు టికెట్ రేట్లను భారీగా తగ్గించిన సంగతి తెలిసిందే.

మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, గీతాఆర్ట్స్-2 బ్యానర్లపై బన్నీవాసు నిర్మించాడు. అల్లు అరవింద్ ప్రజెంట్ చేస్తున్నారు. జేక్స్ బిజోయ్ ఈ సినిమాకు సంగీతం అందించారు.

First Published:  28 Jun 2022 9:01 AM GMT
Next Story