Telugu Global
MOVIE UPDATES

కార్తి సినిమాకు ‘అన్నపూర్ణ’ అండ

హీరో కార్తీ, అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పిఎస్ మిత్రన్‌ కాంబినేషన్ లో వస్తున్న సినిమా సర్దార్. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై లక్ష్మణ్ నిర్మిస్తున్నాడు. ఇప్పుడీ సినిమాకు అన్నపూర్ణ స్టుడియోస్ అండగా నిలిచింది. హీరో నాగార్జున ఈ సినిమా తెలుగు రాష్ట్రాల పంపిణీ హక్కులను సొంతం చేసుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై రిలీజ్ చేయబోతున్నారు. డిస్ట్రిబ్యూషన్ విషయంలో అన్నపూర్ణ స్టుడియోస్ చాలా సెలక్టివ్ గా ఉంటుంది. ఎంతో మంచి కంటెంట్ […]

కార్తి సినిమాకు ‘అన్నపూర్ణ’ అండ
X

హీరో కార్తీ, అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పిఎస్ మిత్రన్‌ కాంబినేషన్ లో వస్తున్న సినిమా సర్దార్. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై లక్ష్మణ్ నిర్మిస్తున్నాడు. ఇప్పుడీ సినిమాకు అన్నపూర్ణ స్టుడియోస్ అండగా నిలిచింది.

హీరో నాగార్జున ఈ సినిమా తెలుగు రాష్ట్రాల పంపిణీ హక్కులను సొంతం చేసుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై రిలీజ్ చేయబోతున్నారు.

డిస్ట్రిబ్యూషన్ విషయంలో అన్నపూర్ణ స్టుడియోస్ చాలా సెలక్టివ్ గా ఉంటుంది. ఎంతో మంచి కంటెంట్ అయితే తప్ప పంపిణీ చేయదు. అలాంటి సంస్థ, కార్తి సినిమాను టేకోవర్ చేయడంతో అందరి దృష్టి సర్దార్ సినిమాపై పడింది.

కార్తీకి తెలుగులో భారీ ఫాలోయింగ్ ఉంది. ‘అభిమన్యుడు’ చిత్రంతో ప్రశంసలు అందుకున్నాడు దర్శకుడు పిఎస్ మిత్రన్. టెక్నాలజీకల్ థ్రిల్లర్స్ అందించడంలో పేరుపొందిన దర్శకుడు ‘సర్దార్‌’ ను మరో ఆసక్తికరమైన కథాంశంతో రూపొందిస్తున్నాడు.

సర్దార్‌లో కార్తి సరసనరాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. రజిషా విజయన్ సెకెండ్ హీరోయిన్ గా కనిపించనుంది. ఓ కీలక పాత్రలో చుంకీ పాండే కనిపించనున్నారు.

జివి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ స్టేజ్ లో ఉంది. 2022 దీపావళికి తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

First Published:  28 Jun 2022 2:23 AM GMT
Next Story