Telugu Global
NEWS

పనోడిని ఓనర్‌గా మార్చిన దళిత బంధు

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకం చాలా మంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది. అర్హులైన దళితులు వ్యాపారం చేసుకోవడానికి పెట్టుబడి సాయంగా రూ. 10 లక్షలు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. హుజూరాబాద్ ఎన్నికల సమయంలో పైలెట్ ప్రాజెక్టుగా మొదలైన ఈ పథకం సూపర్ సక్సెస్ కావడంతో ఇప్పుడు అన్ని నియోజకవర్గాల్లో అమలు చేస్తున్నారు. మొదటి విడతలో రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో 100 యూనిట్ల చొప్పున లబ్దిదారులకు అందిస్తున్నారు. ఈ క్రమంలో నిన్నటి […]

పనోడిని ఓనర్‌గా మార్చిన దళిత బంధు
X

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకం చాలా మంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది. అర్హులైన దళితులు వ్యాపారం చేసుకోవడానికి పెట్టుబడి సాయంగా రూ. 10 లక్షలు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు.

హుజూరాబాద్ ఎన్నికల సమయంలో పైలెట్ ప్రాజెక్టుగా మొదలైన ఈ పథకం సూపర్ సక్సెస్ కావడంతో ఇప్పుడు అన్ని నియోజకవర్గాల్లో అమలు చేస్తున్నారు.

మొదటి విడతలో రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో 100 యూనిట్ల చొప్పున లబ్దిదారులకు అందిస్తున్నారు. ఈ క్రమంలో నిన్నటి వరకు కూలీలు, డ్రైవర్లు, నెల జీతగాళ్లుగా ఉన్న వారు ఏకంగా సొంత వ్యాపారాలు చేసుకుంటున్నారు.

దళిత బంధు ద్వారా వచ్చిన రూ. 10 లక్షలతో చాలా మంది ట్రాక్టర్లు, ట్యాక్సీలు, హార్వెస్టర్లను కొనుక్కొంటున్నారు. కొంత మంది బట్టల దుకాణం, చెప్పుల షాపులు, పౌల్ట్రీ, ఇటుకల వ్యాపారం, హోటల్ వ్యాపారం కూడా చేసుకుంటున్నారు.

గతంతో తాము ఏ పనిలో జీతగాళ్లుగా ఉన్నారో.. ఇప్పుడు దాన్నే వ్యాపారంగా మలుచుకొని సంతోషంగా ముందుకు సాగుతున్నారు. తాజాగా నాగర్‌కర్నూల్ జిల్లాలో కూడా దళితబంధు పథకం ద్వారా చాలా మంది లబ్దిపొందారు. ఇందులో ఒక వ్యక్తి ఎక్కడైతే పనోడిగా జీవించాడో.. అక్కడే ఓనర్‌గా మారిపోయాడు.

నాగర్‌కర్నూల్ జిల్లా బొందల గ్రామానికి చెందిన మధు ఒక డ్రైవర్. గతంలో అడ్డాపై డ్రైవర్‌గా రోజుకు రూ. 600 సంపాదించేవాడు. ప్రతీరోజు అడ్డాకు రావడం.. తనకు తెలిసిన వారి వాహనాలు నడిపి డబ్బులు సంపాదించి ఇంటికి వెళ్లడం.

సంపాదనంతా ఇంటి ఖర్చులకే సరిపోతుంటే.. ఇక సొంత వాహనం అనేది అతడికి కలగానే మారింది. అయితే దళిత బంధు పథకం ద్వారా అతడికి ట్యాక్సీ మంజూరైంది.

మధుకు సొంత వాహనం మంజూరైన విషయం తెలియగానే ఆశ్చర్యపోయాడు. దళిత బంధు ద్వారా తన లైఫ్ మారిపోయినట్లు చెప్తున్నాడు. నిన్నటి వరకు ఏ అడ్డాకు రోజు వారీ డ్రైవర్‌గా వెళ్లాడో.. ఇప్పుడు అక్కడికే సొంత వాహనంలో ఓనర్ కమ్ డ్రైవర్‌గా వెళ్తున్నాడు.

తాను సొంత బండిని నడిపిస్తుండటం చాలా సంతోషంగా ఉందని చెప్పుకున్నాడు. దళితులకు ఆత్మగౌరవం లభించడమే కాకుండా ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని మధు వివరించాడు. ఇంకా మరింత మందికి ఈ పథకం లబ్దిని చేకూర్చాలని ఆకాంక్షించాడు.

First Published:  28 Jun 2022 9:29 AM GMT
Next Story