Telugu Global
MOVIE UPDATES

ఇది నా డైరీలానే ఉంది – అవికా గోర్

టెన్త్ క్లాస్ డైరీస్ అనే సినిమాలో నటించింది అవికా గోర్. ఈ సినిమాలో తను హీరోయిన్ ను మాత్రమే కాదని, సినిమా మొత్తం తన చుట్టూ తిరుగుతుందని చెబుతోంది. ఈ సినిమా తన డైరీలోని పేజీల్ని గుర్తుకు తెచ్చిందని అంటోంది. “ఇదొక స్వీట్ మూవీ. మీ టెన్త్ క్లాస్ సభ్యులు అందరూ కలిస్తే… రీ యూనియన్ అయితే… ఎలా ఉంటుందనేది చూపించారు. రీ యూనియన్ ఒక్కటే కాదు. సాంగ్స్, ట్రైలర్‌లో చూపించని ఒక ఎమోషన్ ఉంది. ఇంకా […]

ఇది నా డైరీలానే ఉంది – అవికా గోర్
X

టెన్త్ క్లాస్ డైరీస్ అనే సినిమాలో నటించింది అవికా గోర్. ఈ సినిమాలో తను హీరోయిన్ ను మాత్రమే కాదని, సినిమా మొత్తం తన చుట్టూ తిరుగుతుందని చెబుతోంది. ఈ సినిమా తన డైరీలోని పేజీల్ని గుర్తుకు తెచ్చిందని అంటోంది.

“ఇదొక స్వీట్ మూవీ. మీ టెన్త్ క్లాస్ సభ్యులు అందరూ కలిస్తే… రీ యూనియన్ అయితే… ఎలా ఉంటుందనేది చూపించారు. రీ యూనియన్ ఒక్కటే కాదు. సాంగ్స్, ట్రైలర్‌లో చూపించని ఒక ఎమోషన్ ఉంది. ఇంకా ఇందులో లిటిల్ బిట్ డ్రామా, ఫ్లాష్‌బ్యాక్‌, కామెడీ ఉంటుంది.

ప్రేక్షకులను ఆకట్టుకునేలా, చాలా వినోదాత్మకంగా దర్శకుడు అంజి తెరకెక్కించారు. నేను ఎంపిక చేసుకునే కథలను ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. ఈ కథను కూడా ఇష్టపడతారని ఆశిస్తున్నాను. ఇంతకు ముందు నేను చేసిన సినిమాలకు డిఫరెంట్ స్క్రిప్ట్ ఇది.”

ఈ సినిమాలో శ్రీరామ్ హీరోగా నటించాడు. అయితే అతడితో తనకు పెద్దగా సీన్లు లేవంటోంది అవిక. హీరోతో, హీరోయిన్ కు సీన్లు లేకపోతే ఎలా? దీనికి అవికా సమాధానం ఇవ్వడం లేదు. సినిమా చూసి తెలుసుకోవాలంటోంది.

ఇక ఈమధ్యకాలంలో తెలుగు సినిమాల్లో వచ్చిన గ్యాప్ పై కూడా అవికా గోర్ స్పందించింది. హిందీ సీరియల్స్ లో నటిస్తుండడం వల్ల తెలుగు సినిమాలు చేయలేకపోయానని, ఇకపై హిందీ సీరియల్స్ తో పాటు తెలుగులో కూడా నటిస్తానని, ఆ మేరకు కాల్షీట్లు సర్దుబాటు చేసుకుంటానని చెబుతోంది ఈ బ్యూటీ.

First Published:  28 Jun 2022 3:06 AM GMT
Next Story