Telugu Global
National

ఉద్దవ్ కు మరో షాక్ …రెబల్ గ్రూపులోకి 14 మంది శివసేన ఎంపీలు ?

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు మరో ఎదురు దెబ్బ తగలనుందా ? ఇప్పటికే శివసేన కు చెందిన 39 మంది ఎమ్మెల్యేలు ఉద్దవ్ నాయకత్వాన్ని ధిక్కరించి ఏక్నాథ్ ష్ండే ఆద్వర్యంలో గౌహతిలో క్యాంప్ పెట్టగా, వారికి తోడు 14 మంది శివసేన ఎంపీలు కూడా తిరుగుబాటుదారులుగా మారి ఏక్నాథ్ ష్ండే శిబిరానికి మద్దతు ప్రకటించారని ఇండియా టుడే ఛానల్ నివేదించింది. శివసేనకు మొత్తం 19 మంది లోక్‌సభ ఎంపీలు ఉన్నారు. ఈ 14 మంది ఎంపీలతో బీజేపీ […]

ఉద్దవ్ కు మరో షాక్ …రెబల్ గ్రూపులోకి 14 మంది శివసేన ఎంపీలు ?
X

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు మరో ఎదురు దెబ్బ తగలనుందా ? ఇప్పటికే శివసేన కు చెందిన 39 మంది ఎమ్మెల్యేలు ఉద్దవ్ నాయకత్వాన్ని ధిక్కరించి ఏక్నాథ్ ష్ండే ఆద్వర్యంలో గౌహతిలో క్యాంప్ పెట్టగా, వారికి తోడు 14 మంది శివసేన ఎంపీలు కూడా తిరుగుబాటుదారులుగా మారి ఏక్నాథ్ ష్ండే శిబిరానికి మద్దతు ప్రకటించారని ఇండియా టుడే ఛానల్ నివేదించింది. శివసేనకు మొత్తం 19 మంది లోక్‌సభ ఎంపీలు ఉన్నారు.

ఈ 14 మంది ఎంపీలతో బీజేపీ నాయకులు టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ సేన ఎంపీలతో రెగ్యులర్ గా మాట్లాడుతున్నారట. అందులో ముఖ్యులైన ఇద్దరు ఎంపీలతో అమిత్ షా కూడా చర్చలు జరిపినట్టు సమాచారం.

అసలైన శివసేన తమదే అని, ఎన్నికల గుర్తు కూడా తమదే అని వాదిస్తున్న ఏక్ నాథ్ షిండే వర్గానికి ఎంపీల మద్దతు కూడా లభించడం కలిసి వచ్చే అంశంగా చెప్పుకుంటున్నారు. ఇదే విషయంపై ఏక్ నాథ్ షిండే త్వరలో గవర్నర్ ను కలిసి తమదే అసలైన శివసేనగా గుర్తించాలని కోరనున్నట్టు తెలుస్తోంది.

మరో వైపు ఇప్పటికే పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలను కోల్పోయిన ఉద్దవ్ ఠాక్రేకు 14 మంది ఎంపీలు కూడా తిరుగుబాటు చేస్తారన్న వార్త షాకింగే. ఎంపీలందరితో చర్చలు జరిపేందుకు ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

First Published:  28 Jun 2022 4:12 AM GMT
Next Story