Telugu Global
MOVIE UPDATES

విక్రమ్ అరుదైన రికార్డ్..!

విశ్వనటుడు కమల్ హాసన్ కు విజయాల దాహాన్ని తీర్చిన సినిమా విక్రమ్. అప్పుడెప్పుడో 14 ఏళ్ల కిందట దశావతారం సినిమా తో చివరి హిట్ అందుకున్నాడు కమల్ హాసన్. అప్పటి నుంచి ఎన్ని సినిమాలు చేసినా కమల్ కు సరైన విజయం దక్కలేదు. తాజాగా ఆయన యంగ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తో చేసిన విక్రమ్ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కమల్ హాసన్ తో పాటు విజయ్ సేతుపతి, […]

విక్రమ్ అరుదైన రికార్డ్..!
X

విశ్వనటుడు కమల్ హాసన్ కు విజయాల దాహాన్ని తీర్చిన సినిమా విక్రమ్. అప్పుడెప్పుడో 14 ఏళ్ల కిందట దశావతారం సినిమా తో చివరి హిట్ అందుకున్నాడు కమల్ హాసన్. అప్పటి నుంచి ఎన్ని సినిమాలు చేసినా కమల్ కు సరైన విజయం దక్కలేదు. తాజాగా ఆయన యంగ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తో చేసిన విక్రమ్ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కమల్ హాసన్ తో పాటు విజయ్ సేతుపతి, పహద్ ఫాజిల్ ముఖ్య పాత్రలు పోషించారు. స్టార్ హీరో సూర్య అతిథి పాత్రలో మెరిశారు.

విడుదలైన తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సూపర్ హిట్ గా నిలిచిన ఈ మూవీ కోలీవుడ్ లో రికార్డులను తిరగరాస్తోంది. ఇప్పటివరకు కోలీవుడ్ లో రూ. 400 కోట్ల క్లబ్ లో చేరిన సినిమా రజినీకాంత్ హీరోగా నటించిన రోబో 2.0 మాత్రమే ఉంది. ఇప్పుడు విక్రమ్ సినిమా కూడా రూ.400 కోట్ల క్లబ్ లో చేరింది. విడుదలైన నెలరోజుల్లోపే ఈ సినిమా ఆ రికార్డు అందుకోవడం విశేషం. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న విక్రమ్ సినిమా ముందు ముందు ఎన్ని రికార్డులు తిరగరాస్తోందో చూడాలి.

కాగా చాలా ఏళ్ళ తర్వాత తనకు విజయం దక్కడంతో కమలహాసన్ లో మునుపటి జోష్ కనిపిస్తోంది. తనకు విజయాన్ని అందించిన డైరెక్టర్ లోకేష్ కి ఒక కాస్ట్లీ కారు కొనిచ్చాడు కమల్. అలాగే ఈ సినిమా కోసం పనిచేసిన 13 మంది అసిస్టెంట్ డైరెక్టర్లకు బైకులు కొనిచ్చాడు. రోలెక్స్ పాత్రలో నటించి దుమ్ము రేపిన సూర్యకు కమల్ తన ఖరీదైన రోలెక్స్ వాచ్ ని గిఫ్ట్ గా ఇచ్చాడు.

First Published:  27 Jun 2022 12:14 AM GMT
Next Story