Telugu Global
MOVIE UPDATES

పాన్ ఇండియా డైరెక్టర్ తో వరుణ్ తేజ్..!

హిట్, ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు యంగ్ హీరో వరుణ్ తేజ్. ఇటీవల ఆయన నటించిన గని సినిమా ప్లాప్ కాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సీనియర్ హీరో వెంకటేష్ తో కలిసి చేసిన ఎఫ్-3 మాత్రం మంచి ఫలితాన్నే ఇచ్చింది. ప్రస్తుతం వరుణ్ తేజ్ ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ సెట్స్ పై ఉంది. ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే మరో సినిమాను లైన్ […]

పాన్ ఇండియా డైరెక్టర్ తో వరుణ్ తేజ్..!
X

హిట్, ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు యంగ్ హీరో వరుణ్ తేజ్. ఇటీవల ఆయన నటించిన గని సినిమా ప్లాప్ కాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సీనియర్ హీరో వెంకటేష్ తో కలిసి చేసిన ఎఫ్-3 మాత్రం మంచి ఫలితాన్నే ఇచ్చింది. ప్రస్తుతం వరుణ్ తేజ్ ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ సెట్స్ పై ఉంది.

ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే మరో సినిమాను లైన్ లో పెట్టాడు వరుణ్. రన్ రాజా రన్ తో తొలి సినిమాతోనే హిట్ అందుకున్న యంగ్ డైరెక్టర్ సుజిత్ ఆ తర్వాత ఏకంగా ప్రభాస్ తో సాహో అనే సినిమా చేశాడు. ఈ సినిమా బాలీవుడ్ లో మంచి విజయం సాధించినప్పటికీ తెలుగులో మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత చిరంజీవి హీరోగా నటిస్తున్న లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ కు సుజిత్ దర్శకత్వం వహిస్తారని ప్రచారం జరిగింది. అయితే ఆ అవకాశం మోహన్ రాజాకు దక్కింది.

దీంతో సుజిత్ మరో మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ కోసం ఓ స్టైలిష్ యాక్షన్ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సుజిత్ వరుణ్ ను కలిసి కథ వినిపించగా, వరుణ్ ఓకే చెప్పినట్లు సమాచారం. దీంతో సుజిత్ పూర్తి స్క్రిఫ్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నాడు. వరుణ్ – ప్రవీణ్ సత్తార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న యాక్షన్ సినిమా పూర్తయిన తర్వాత సుజిత్ తో చేసే సినిమా ప్రారంభం కానుంది. ఈ సినిమాతో అయినా సుజిత్ మళ్ళీ లైన్లో పడతాడో లేదో చూడాలి.

First Published:  27 Jun 2022 1:25 AM GMT
Next Story