Telugu Global
NEWS

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల వేళ… ఆ పార్టీకి షాకిచ్చిన టీఆరెస్

మరో 6 రోజుల్లో హైదరాబాద్ లో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశాలకు ఆ పార్టీ అగ్ర నాయకులు ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డాతో సహా అతిరథ మహారథులంతా హాజరవుతున్నారు. దాంతో ఈ సమావేశాల ఏర్పాట్లను ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండిసంజయ్ ప్రతిష్ఠ‌గా తీసుకున్నారు. తన అతిథి మర్యాదలు, ప్రచారం చూసి అగ్రనాయకత్వం డంగై పోవాలని సంజయ్ భావిస్తున్నారు. అందుకోసం నగరం […]

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల వేళ… ఆ పార్టీకి షాకిచ్చిన టీఆరెస్
X

మరో 6 రోజుల్లో హైదరాబాద్ లో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశాలకు ఆ పార్టీ అగ్ర నాయకులు ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డాతో సహా అతిరథ మహారథులంతా హాజరవుతున్నారు. దాంతో ఈ సమావేశాల ఏర్పాట్లను ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండిసంజయ్ ప్రతిష్ఠ‌గా తీసుకున్నారు.

తన అతిథి మర్యాదలు, ప్రచారం చూసి అగ్రనాయకత్వం డంగై పోవాలని సంజయ్ భావిస్తున్నారు. అందుకోసం నగరం మొత్తం మోదీ తో సహా అగ్రనాయకుల కటౌట్లు, బ్యానర్లు, పోస్టర్లతో నింపేయాలని ప్రణాళికలు వేస్తున్నారు. అయితే సడెన్ గా ఆ ప్రణాళికలకు తెలంగాణ రాష్ట్ర సమితి గండి కొట్టి సంజయ్ కి షాకిచ్చింది.

హైదరాబాద్ నగరంలోని మెట్రో పిల్లర్లను వారం రోజుల పాటు రిజ‌ర్వ్ చేసుకుంది ప్రభుత్వం. L&T, అడ్వర్టైజ్‌మెంట్ ఏజెన్సీ‌లతో వారం రోజులకు గాను ఒప్పందాలు కుదుర్చుకుంది. ప్రభుత్వ అభివృద్ది కార్యక్రమాలను ప్రచారం చేయడానికి నిర్ణయించుకుంది. అందుకోసం ఎక్కడా ఖాళీ లేకుండా పోస్టర్లు, బ్యానర్లతో నింపేయ‌నుంది. మెట్రో పిల్లర్లపై పోస్టర్లు అంటించడం అప్పుడే ప్రారంభమైపోయింది. 2,300లకు పైగా మెట్రో పిల్లర్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటోలతో ప్రభుత్వ సంక్షేమ పథకాలతో కూడిన పోస్టర్లు దర్శనమిస్తున్నాయి.

ఇలా టీఆరెస్ బీజేపీకి ఊహించని షాక్ ఇవ్వడంతో బీజేపీ నేతలు తలలు పట్టుకుంటున్నారట. ముఖ్యంగా బండి సంజయ్ ఇప్పుడు తమ ప్రచారం ఎలా చేయాలనేదానిపై తన సన్నిహితులతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ప్రచార ఆర్భాటాలతో తన సత్తా చాటుకోవాలన్న బండిసంజయ్ ఆలోచనల‌పై టీఆరెస్ నీళ్ళు చల్లడాన్ని ఆయన అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారు.

First Published:  27 Jun 2022 12:12 AM GMT
Next Story