Telugu Global
MOVIE UPDATES

ఈ సినిమాకు త్రివిక్రమ్ పేరు పడదు

భీమ్లానాయక్ సినిమాకు అన్నీ తానై వ్యవహరించాడు త్రివిక్రమ్. అయితే ఆ సినిమాకు దర్శకుడు మాత్రం త్రివిక్రమ్ కాదు. సాగర్ చంద్ర దర్శకత్వంలో వచ్చింది ఆ సినిమా. ఇప్పుడు మరోసారి ఇలాంటి వ్యవహారమే రిపీట్ కాబోతోంది. పవన్ మరో రీమేక్ చేస్తున్నాడు. దానికి త్రివిక్రమ్, స్క్రీన్ ప్లే-డైలాగ్స్ అందిస్తున్నాడు. సముత్తరఖని దర్శకత్వం వహించబోతున్నాడు. అయితే అప్పటికీ ఇప్పటికీ తేడా ఒకటే. ఈసారి త్రివిక్రమ్ పేరు కనిపించదు. అవును.. త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న వినోదాయ శితం రీమేక్ కు […]

ఈ సినిమాకు త్రివిక్రమ్ పేరు పడదు
X

భీమ్లానాయక్ సినిమాకు అన్నీ తానై వ్యవహరించాడు త్రివిక్రమ్. అయితే ఆ సినిమాకు దర్శకుడు మాత్రం త్రివిక్రమ్ కాదు. సాగర్ చంద్ర దర్శకత్వంలో వచ్చింది ఆ సినిమా. ఇప్పుడు మరోసారి ఇలాంటి వ్యవహారమే రిపీట్ కాబోతోంది. పవన్ మరో రీమేక్ చేస్తున్నాడు.

దానికి త్రివిక్రమ్, స్క్రీన్ ప్లే-డైలాగ్స్ అందిస్తున్నాడు. సముత్తరఖని దర్శకత్వం వహించబోతున్నాడు. అయితే అప్పటికీ ఇప్పటికీ తేడా ఒకటే. ఈసారి త్రివిక్రమ్ పేరు కనిపించదు.

అవును.. త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న వినోదాయ శితం రీమేక్ కు సంబంధించి త్రివిక్రమ్ పేరు కనిపించే అవకాశం లేదు. ఈ మేరకు కథనాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ త్రివిక్రమ్ అందించిన మాట వాస్తవమే. కానీ హారిక-హాసిని బ్యానర్ తో ఉన్న ఒప్పందం మేరకు ఆయన ఇతర సంస్థలకు సినిమాలు చేయకూడదు.

వినోదాయ శితం సినిమా పీపుల్ మీడియా బ్యానర్ పై వస్తోంది. ఆ బ్యానర్ పై వచ్చే సినిమాలో త్రివిక్రమ్ పేరు కనిపిస్తే, నిబంధనలు ఉల్లంఘించినట్టే అవుతుంది. అలా అని తప్పుకుంటే.. పవన్ కల్యాణ్ అంగీకరించడు. మొత్తానికే సినిమాను పక్కనపెట్టేసే ప్రమాదం ఉంది.

అందుకే అన్ని రకాలుగా ఆలోచించి, త్రివిక్రమ్ ఓ తెలివైన నిర్ణయం తీసుకున్నాడు. ఈ ప్రాజక్టులో నిర్మాణ భాగస్వామిగా మారాడు త్రివిక్రమ్. ఫార్యూన్ 4 సినిమాస్ అనే బ్యానర్ ను పీపుల్ మీడియాకు జోడించాడు. దీంతో టైటిల్స్ లో సహ-నిర్మాత అంటూ త్రివిక్రమ్ భార్య పేరు పడుతుంది.

ప్రస్తుతానికైతే ఈ ఒప్పందానికి ఫిక్స్ అయ్యారు. స్క్రీన్ ప్లే-డైలాగ్స్ దగ్గర త్రివిక్రమ్ పేరు వేయాలా వద్దా అనేది ఆఖరి నిమిషంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ టైటిల్స్ లో త్రివిక్రమ్ పేరు పడితే మాత్రం, హారిక-హాసిని నుంచి త్రివిక్రమ్ తొలిసారి బయటకొచ్చినట్టవుతుంది.

First Published:  27 Jun 2022 9:11 AM GMT
Next Story