Telugu Global
MOVIE UPDATES

రంగ రంగ వైభవంగా టీజర్ వచ్చేసింది..!

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, తమిళ్ అర్జున్ రెడ్డి ఫేమ్ గిరీశయ్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రంగ రంగ వైభవంగా. ఈ సినిమాలో హీరోయిన్ గా యంగ్ బ్యూటీ కేతిక శర్మ నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. కాగా కాసేపటి క్రితమే రంగ రంగ వైభవంగా టీజర్ యూట్యూబ్ లో విడుదలైంది. ‘నన్నే చూస్తావ్. నా గురించే కలలుకంటావ్.. నన్నే ప్రేమిస్తావ్.. కానీ నీకు నాతో మాట్లాడటానికి […]

రంగ రంగ వైభవంగా టీజర్ వచ్చేసింది..!
X

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, తమిళ్ అర్జున్ రెడ్డి ఫేమ్ గిరీశయ్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రంగ రంగ వైభవంగా. ఈ సినిమాలో హీరోయిన్ గా యంగ్ బ్యూటీ కేతిక శర్మ నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. కాగా కాసేపటి క్రితమే రంగ రంగ వైభవంగా టీజర్ యూట్యూబ్ లో విడుదలైంది.

‘నన్నే చూస్తావ్. నా గురించే కలలుకంటావ్.. నన్నే ప్రేమిస్తావ్.. కానీ నీకు నాతో మాట్లాడటానికి ఈగో.. అని హీరోయిన్ చెప్పే డైలాగ్, దీనెమ్మ జీవితం మానవత్వం చచ్చిపోయింది భయ్యా.. అని హీరో పలికే డైలాగ్ .. కమెడియన్ అలీ అరే బామ్మర్ది ఈ వంకర మాటలే వద్దంటున్నా.. అనే చెప్పే డైలాగ్ ఆకట్టుకునేలా ఉన్నాయి.

రంగ రంగ వైభవంగా సినిమా రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోంది. స్క్రీన్ పై వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ జంట ఆకట్టుకునేలా ఉంది. అలీ చాలా రోజుల తర్వాత మరో సినిమాలో కనిపించాడు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమాలోని ‘కొత్తగా లేదేంటి’ అనే సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ వచ్చే నెల ఒకటో తేదీన విడుదల చేస్తున్నట్లు ముందుగా మేకర్స్ ప్రకటించారు. అయితే పలు కారణాల వల్ల ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు. అతి త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది. వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం ఈ సినిమాతో పాటు కొత్త డైరెక్టర్ శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో ఒక యాక్షన్ చిత్రంలో నటిస్తున్నాడు.

First Published:  27 Jun 2022 6:58 AM GMT
Next Story