Telugu Global
National

ఒక్కో ఎమ్మెల్యే ధర 50 కోట్లు!

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి కథ , దర్శకత్వం మొత్త‍ం బీజేపీదేనని శివసేన అద్జికార పత్రిక‌ సామ్నా తన సంపాదకీయంలో తీవ్ర ఆరోపణలు చేసింది. ఏక్ నాథ్ షిండే నాయకత్వంలో జరిగిన తిరుగుబాటుతో తమకే సంబంధంలేదని బీజేపీ నాయకులుచెప్తున్న మాటలు పచ్చి అబద్దమని సామ్నా ఆరోపించింది. “ రాత్రి చీకటిలో, ఏక్నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవిస్ (ప్రతిపక్ష నాయకుడు) వడోదరలో కలుసుకున్నారు. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా హాజరయ్యారు.సమావేశం ముగిసిన తర్వాత కేంద్రం వెంటనే […]

ఒక్కో ఎమ్మెల్యే ధర 50 కోట్లు!
X

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి కథ , దర్శకత్వం మొత్త‍ం బీజేపీదేనని శివసేన అద్జికార పత్రిక‌ సామ్నా తన సంపాదకీయంలో తీవ్ర ఆరోపణలు చేసింది. ఏక్ నాథ్ షిండే నాయకత్వంలో జరిగిన తిరుగుబాటుతో తమకే సంబంధంలేదని బీజేపీ నాయకులుచెప్తున్న మాటలు పచ్చి అబద్దమని సామ్నా ఆరోపించింది.

“ రాత్రి చీకటిలో, ఏక్నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవిస్ (ప్రతిపక్ష నాయకుడు) వడోదరలో కలుసుకున్నారు. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా హాజరయ్యారు.సమావేశం ముగిసిన తర్వాత కేంద్రం వెంటనే రెబల్ ఎమ్మెల్యేలకు వై ప్లస్ భద్రతను కల్పించింది. దీంతో బీజేపీ ముసుగు చిరిగి పోయింది” అని సామ్నా పత్రిక ఆరోపించింది.

ఈ సంక్షోభానికి బీజేపీయే కారణం. లోక్ నాథ్ షిండే, మాజీ సీఎం ఫడ్నవీస్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా శివసేనను చీల్చాలని కుట్రలు చేశారు. అందులో భాగంగా ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 50 కోట్లు ఆఫర్ చేశారు. బీజేపీ తెరవెనక పన్నాగాలు పన్ని.. ఇప్పుడేమో ఏమీ తెలియనట్టు నటిస్తోంది. అని సామ్నా పత్రిక విమర్షలు గుప్పించింది.

గౌహతిలో ఉన్న 15 మంది శివసేన ఎమ్మెల్యేలకు కేంద్ర ప్రభుత్వం వై ప్లస్ సెక్యూరిటీ కల్పించింది. దీని బట్టే బీజేపీ కుట్ర ఏమిటో అర్థం అవుతోంది. బీజేపీకి ధైర్యం ఉంటే ఎమ్మెల్యేలను మహారాష్ట్రకు తీసుకురావాలి. అప్పుడు అసలు విషయం అందరికీ అర్థం అవుతుంది. ప్రజలు శివసేన వెంటే ఉన్నారు. ఎన్ని రాజకీయాలు చేసినా కొన్ని రోజులు మాత్రమే.. ప్రజాబలం లేకపోతే ఎవరూ ఏమీచేయలేరు’ అంటూ సంపాదకీయంలో బీజేపీపై ఘాటు విమర్శలు చేశారు.

మరోవైపు శివసేన ఎమ్మెల్యే ఉదయ్ సింగ్ రాథోడ్ మాట్లాడుతూ.. షిండే వర్గంలోకి తనను రమ్మంటూ రూ. 50 కోట్లు ఆఫర్ చేశారని చెప్పారు. ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి.షిండే వర్గం సాయంతో బీజేపీ అధికారం దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది. మొత్తానికి అధికారం కోసం మహారాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. మహా అఘాడి కూటమిలో చిచ్చు రేగింది. ఏం జరుగుతుందో అని అక్కడ సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.

First Published:  27 Jun 2022 2:12 AM GMT
Next Story