Telugu Global
MOVIE UPDATES

రంగ రంగ వైభవంగా టీజర్ రివ్యూ

వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ జంటగా గిరీశాయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘రంగ రంగ వైభవంగా’. ఈ రోజు ఈ సినిమా టీజర్ రిలీజైంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ ను గ్రాండ్ ఈవెంట్ ద్వారా రిలీజ్ చేశారు. ఒక నిమిషం 23 సెకన్ల తో కట్ చేసిన ఈ టీజర్, సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచింది. టీజర్ చూస్తే చాలా రోజుల తర్వాత కాలేజ్ […]

రంగ రంగ వైభవంగా టీజర్ రివ్యూ
X

వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ జంటగా గిరీశాయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘రంగ రంగ వైభవంగా’. ఈ రోజు ఈ సినిమా టీజర్ రిలీజైంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ ను గ్రాండ్ ఈవెంట్ ద్వారా రిలీజ్ చేశారు. ఒక నిమిషం 23 సెకన్ల తో కట్ చేసిన ఈ టీజర్, సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచింది.

టీజర్ చూస్తే చాలా రోజుల తర్వాత కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఓ మంచి లవ్ స్టోరీ రాబోతుందని అర్థమవుతుంది. ముఖ్యంగా సినిమాలో యూత్ కి నచ్చే ఎలిమెంట్స్ దర్శకుడు చాలానే ప్లాన్ చేశాడని టీజర్ లో కొన్ని సీన్స్ చూస్తే తెలుస్తుంది. సినిమాలో మాస్ కోరుకునే ఫైట్స్ కూడా ఉన్నాయని టీజర్ లో చూపించాడు దర్శకుడు.

ఇక సినిమాలో మెయిన్ పాయింట్ ఏంటనేది కూడా టీజర్ లో చెప్పేశారు. హీరోహీరోయిన్లు ఇగో సమస్యలతో ఉంటారు. ప్రేమలో ఉన్నప్పటికీ, ఇగోల వల్ల ఇద్దరూ మాట్లాడుకోరు. ఈ మెయిన్ పాయింట్ ను కూడా టీజర్ లో చెప్పేశారు. శ్యామ్ దత్ విజువల్స్, దేవిశ్రీప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ లో హైలెట్ గా నిలిచాయి.

గిరీశాయ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్న ఈ సినిమాను జులై నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

First Published:  27 Jun 2022 4:31 AM GMT
Next Story