Telugu Global
MOVIE UPDATES

సల్మాన్ సినిమాలో చరణ్ అతిథి పాత్ర

కభీ ఈద్ కభీ దివాళీ అనే సినిమా చేస్తున్నాడు సల్మాన్ ఖాన్. ఈ సినిమాలో సల్మాన్ సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఓ కీలక పాత్రలో వెంకటేష్ కనిపిస్తున్నాడు. సినిమాలో పూజాహెగ్డేకు అన్నయ్యగా వెంకీ కనిపించబోతున్నాడు. ఇప్పుడీ సినిమాలోకి చరణ్ కూడా వచ్చి చేరాడు. ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఓ సాంగ్ షూట్ జరుగుతుంటే, సల్మాన్ ను కలిసేందుకు రామ్ చరణ్ ఫిలింసిటీకి వెళ్లాడు. వెంటనే సల్మాన్ కు […]

సల్మాన్ సినిమాలో చరణ్ అతిథి పాత్ర
X

కభీ ఈద్ కభీ దివాళీ అనే సినిమా చేస్తున్నాడు సల్మాన్ ఖాన్. ఈ సినిమాలో సల్మాన్ సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఓ కీలక పాత్రలో వెంకటేష్ కనిపిస్తున్నాడు. సినిమాలో పూజాహెగ్డేకు అన్నయ్యగా వెంకీ కనిపించబోతున్నాడు. ఇప్పుడీ సినిమాలోకి చరణ్ కూడా వచ్చి చేరాడు.

ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఓ సాంగ్ షూట్ జరుగుతుంటే, సల్మాన్ ను కలిసేందుకు రామ్ చరణ్ ఫిలింసిటీకి వెళ్లాడు. వెంటనే సల్మాన్ కు మెరుపులాంటి ఆలోచన వచ్చింది. చరణ్ ను ఆ పాటలోకి లాక్కొచ్చాడు. ఆ సాంగ్ లో సల్మాన్, పూజాహెగ్డేతో పాటు రామ్ చరణ్ కూడా కనిపించబోతున్నాడు. అలా ఈ సినిమాలో భాగమయ్యాడు రామ్ చరణ్.

ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత సల్మాన్ ను ప్రత్యేకంగా తన ఇంటికి ఆహ్వానించాడు చరణ్. సల్మాన్ తో పాటు పూజా, వెంకటేష్ కూడా చరణ్ ఇంటికి వెళ్లారు. వీళ్లందర్నీ ఉపాసన సాదరంగా ఆహ్వానించింది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

First Published:  26 Jun 2022 8:47 PM GMT
Next Story