Telugu Global
NEWS

వారంలో ఒక రోజు నో బ్యాగ్ డే.. ఏపీ ప్రభుత్వం నిర్ణయం..!

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాఠశాల విద్యకు సంబంధించి పలు సంస్కరణలు తీసుకు వచ్చింది. పాఠశాలలో ఇంగ్లీష్ మీడియాన్ని అమలు చేస్తోంది. నాడు – నేడు అనే పథకాన్ని ప్రవేశపెట్టి పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తోంది. ఈ పథకంలో భాగంగా పాఠశాలల్లో నూతన భవనాలు నిర్మిస్తోంది. అలాగే ఉన్న భవనాలకు మరమ్మతులు చేపడుతోంది. కాగా తాజాగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారంలో ఒకరోజు పాఠశాలలో నో బ్యాగ్ డే అమలు చేయాలని […]

వారంలో ఒక రోజు నో బ్యాగ్ డే.. ఏపీ ప్రభుత్వం నిర్ణయం..!
X

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాఠశాల విద్యకు సంబంధించి పలు సంస్కరణలు తీసుకు వచ్చింది. పాఠశాలలో ఇంగ్లీష్ మీడియాన్ని అమలు చేస్తోంది. నాడు – నేడు అనే పథకాన్ని ప్రవేశపెట్టి పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తోంది. ఈ పథకంలో భాగంగా పాఠశాలల్లో నూతన భవనాలు నిర్మిస్తోంది.

అలాగే ఉన్న భవనాలకు మరమ్మతులు చేపడుతోంది. కాగా తాజాగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారంలో ఒకరోజు పాఠశాలలో నో బ్యాగ్ డే అమలు చేయాలని నిర్ణయించింది. పాఠశాలలకు పిల్లలు ఉత్సాహంగా హాజరయ్యేందుకు కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలో వచ్చే నెల 5వ తేదీన వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి అకాడమిక్ క్యాలెండర్ ను విడుదల చేసింది. ఆ ప్రకారం..ప్రతి తరగతికి వారానికి 48 పీరియడ్లు ఉంటాయి. ప్రతి ఉపాధ్యాయుడు వారానికి 38 నుంచి 39 పీరియడ్లు బోధన చేయాల్సి ఉంటుంది.

ప్రాథమిక పాఠశాలలో చదివే ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 3.30 గంటల వరకు తరగతులు ఉంటాయి. 3.30 నుంచి నాలుగు గంటల వరకు గేమ్స్, రివిజన్ క్లాసులు ఉంటాయి.

ప్రీ హైస్కూల్, హైస్కూల్, హైస్కూల్ ప్లస్ పాఠశాలలో తరగతులు ఉదయం 9 నుంచి సాయంత్రం నాలుగు గంటల దాకా ఉంటాయి. 4 నుంచి 5 గంటల దాకా గేమ్స్, రివిజన్ క్లాసులు ఉంటాయి. ఇక వారంలో ఒక రోజు నో బ్యాగ్ డే ఉంటుంది.

విద్యార్థులకు 5వ తేదీ పాఠశాలలు ప్రారంభం కానుండగా, టీచర్లు మాత్రం రేపటి నుంచి పాఠశాలలకు హాజరు కావాల్సి ఉంటుంది. వీరు విద్యార్థులు పాఠశాలలకు వచ్చేలోగా పాఠశాల తరగతులను సిద్ధం చేయించాల్సి ఉంటుంది. మరోవైపు ప్రభుత్వం పాఠశాలలు ప్రారంభం కాగానే ఐదవ తేదీన విద్యార్థులకు విద్య కానుకల కిట్ల పంపిణీకి సన్నాహాలు చేస్తోంది.

First Published:  27 Jun 2022 2:17 AM GMT
Next Story