Telugu Global
NEWS

సైబర్​ నేరగాళ్ల కొత్త టెక్నిక్: డీజీపీ మహేందర్ రెడ్డి పేరుతో వసూళ్ళు

సైబర్ నేరగాళ్ళు కొత్త కొత్త పద్దతులు అనుసరిస్తున్నారు. బ్యాంక్ అకౌంట్లను, క్రెడిట్, డెబిట్ కార్డులను హ్యాక్ చేయడం ద్వారా సొమ్ము కొట్టేసే సైబర్ గ్యాంగులు ఈ మధ్య సోషల్ మీడియా ద్వారా వసూళ్ళకు పాల్పడుతున్నారు. ఫేస్ బుక్ లో మనకు తెలిసిన మిత్రుల పేరుతో అకౌంట్లు ఓపెన్ చేసి ఆ అకౌంట్ల ద్వారా మన మిత్రులే అడిగినట్టు అర్జెంట్ అవసరమంటూ డబ్బులు అడుగుతున్నారు. వాట్సప్ లో కూడా మనకు తెలిసిన వాళ్ళ ఫోటోలు డిపీ లుగా పెట్టి […]

సైబర్​ నేరగాళ్ల కొత్త టెక్నిక్: డీజీపీ మహేందర్ రెడ్డి పేరుతో వసూళ్ళు
X

సైబర్ నేరగాళ్ళు కొత్త కొత్త పద్దతులు అనుసరిస్తున్నారు. బ్యాంక్ అకౌంట్లను, క్రెడిట్, డెబిట్ కార్డులను హ్యాక్ చేయడం ద్వారా సొమ్ము కొట్టేసే సైబర్ గ్యాంగులు ఈ మధ్య సోషల్ మీడియా ద్వారా వసూళ్ళకు పాల్పడుతున్నారు.

ఫేస్ బుక్ లో మనకు తెలిసిన మిత్రుల పేరుతో అకౌంట్లు ఓపెన్ చేసి ఆ అకౌంట్ల ద్వారా మన మిత్రులే అడిగినట్టు అర్జెంట్ అవసరమంటూ డబ్బులు అడుగుతున్నారు. వాట్సప్ లో కూడా మనకు తెలిసిన వాళ్ళ ఫోటోలు డిపీ లుగా పెట్టి డబ్బులు అడుగుతున్నారు. ఇప్పుడు ఏకంగా డిజీపీ ఫోటోనే డిపీగా పెట్టి ఆ డీజీపేయే డబ్బులు అడిగినట్టుగా పోలీసు అధికారుల దగ్గర, ఇతరుల దగ్గర డబ్బులు అడుగుతున్నారు.

97857 43029 నెంబర్‌కు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఫోటోను డీపీగా పెట్టిన సైబర్ నేరగాళ్ళు అనేక మంది పోలీసు అధికారులకు, పోలీసు కానిస్టేబుళ్ళకు, సాధారణ ప్రజలకు అర్జంట్ అవసరమని, డబ్బులు కావాలంటూ మెసేజ్ లు పెట్టారు. దీనిపై కొందరు సైబర్ క్రైం అధికారులకు పిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఇటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు హెచ్చరించారు. డిజీపీ మహేందర్ రెడ్డి కూడా దీనిపై విచారణకు ఆదేశించారు. అయితే కొందరు ఈ సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో పడి డబ్బులు పోగొట్టుకున్నట్టు తెలుస్తోంది.

First Published:  27 Jun 2022 2:16 AM GMT
Next Story