Telugu Global
MOVIE UPDATES

ప్రభాస్ సినిమాపై మారుతి క్లారిటీ

ప్రభాస్-మారుతి కాంబో లాక్ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమధ్య ప్రభాస్, ఈమధ్య మారుతి ఇద్దరూ నిర్థారించారు. అయితే ఎలాంటి సినిమా రాబోతోందనే అంశంపై మాత్రం ఇన్నాళ్లూ మారుతి క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు ఆ స్పష్టత కూడా వచ్చేసింది. ప్రభాస్ తో తన స్టయిల్ లోనే ఓ కామెడీ సినిమా చేస్తానంటూ పరోక్షంగా వెల్లడించాడు మారుతి. “ప్రభాస్ ని ఎలా చూపించాలో నాకు ఓ ఐడియా ఉంది. అలానే చూపిస్తూ సినిమా చేస్తాను. జోనర్ తో […]

ప్రభాస్ సినిమాపై మారుతి క్లారిటీ
X

ప్రభాస్-మారుతి కాంబో లాక్ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమధ్య ప్రభాస్, ఈమధ్య మారుతి ఇద్దరూ నిర్థారించారు. అయితే ఎలాంటి సినిమా రాబోతోందనే అంశంపై మాత్రం ఇన్నాళ్లూ మారుతి క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు ఆ స్పష్టత కూడా వచ్చేసింది. ప్రభాస్ తో తన స్టయిల్ లోనే ఓ కామెడీ సినిమా చేస్తానంటూ పరోక్షంగా వెల్లడించాడు మారుతి.

“ప్రభాస్ ని ఎలా చూపించాలో నాకు ఓ ఐడియా ఉంది. అలానే చూపిస్తూ సినిమా చేస్తాను. జోనర్ తో పాటు టైటిల్స్ కూడా కొన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇక సినిమా కూడా వాళ్ళే తీసేస్తే బాగుంటుంది (నవ్వుతూ). నేను ఎలాంటి సినిమాలు తీయగలనో అందరికీ తెలుసు. అలాంటి సినిమా కోసమే నన్ను అప్రోచ్ అయ్యారు. కాబట్టి ప్రభాస్ తో నేను చేయబోయే సినిమా నా స్టయిల్ లోనే ఉంటుంది. ఉదాహరణకు నేను నాటుకోడి బాగా చేస్తానని ఒకరు నన్ను అది వండమంటే నేను అదే వండాలి.

అంతే తప్ప చైనీస్ ట్రై చేస్తానంటే కుదరదు కదా. కాబట్టి ప్రభాస్ తో చేయబోయే సినిమా నా సినిమాల తరహాలోనే ఉంటుంది. అయితే అది పాన్ ఇండియా స్కేల్ లో ఉంటుంది. ప్రభాస్ ని ఎలా చూపిస్తే ఆడియన్స్ హ్యాపీగా ఫీలవుతారో సరిగ్గా అలానే చూపించే ప్రయత్నం చేస్తాను. త్వరలోనే మా కాంబో సినిమా ఉంటుంది.”

ఇలా ప్రభాస్ తో చేయబోయే సినిమా జానర్ పై స్పందించాడు మారుతి. పక్కా కమర్షియల్ మూవీ ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రభాస్ తో సినిమా త్వరలోనే ఉంటుందని స్పష్టం చేశాడు. డీవీవీ దానయ్య నిర్మాతగా ఈ సినిమా వచ్చే అవకాశం ఉంది.

ఇక ఇందులో హీరోయిన్లు ఎవరనే అంశంపై కూడా మారుతి స్పందించాడు. సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఒక్క పేరు కూడా తమకు తట్టలేదని, అసలు హీరోయిన్ల వరకు మేటర్ వెళ్లలేదని స్పష్టంచేశాడు. ముందుగా ప్రభాస్ తో స్టోరీ డిస్కషన్లు జరగాలని, ఆ తర్వాతే మిగతా వ్యవహారాలన్నీ మొదలవుతాయని తెలిపాడు మారుతి.

First Published:  27 Jun 2022 9:15 AM GMT
Next Story