Telugu Global
MOVIE UPDATES

లారెన్స్ -కేఎస్ రవికుమార్ కొత్త చిత్రం ప్రారంభం..!

ముందుగా డ్యాన్స్ మాస్టర్ గా, ఆ తర్వాత డైరెక్టర్ గా నిరూపించుకున్న రాఘవ లారెన్స్ ఇప్పుడు హీరోగా సెటిల్ అయిపోయాడు. వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే లారెన్స్ నటిస్తున్న రెండు సినిమాలు సెట్స్ పై ఉండగా తాజాగా సీనియర్ డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో మరో సినిమాను ప్రారంభించాడు లారెన్స్. ఈ చిత్ర ప్రారంభోత్సవం పూజా కార్యక్రమాలు తాజాగా చెన్నైలో జరిగాయి. ఈ సినిమాలో లారెన్స్ తో పాటు అతడి సోదరుడు ఎల్విన్ కూడా ఒక ప్రధాన పాత్రలో […]

లారెన్స్ -కేఎస్ రవికుమార్ కొత్త చిత్రం ప్రారంభం..!
X

ముందుగా డ్యాన్స్ మాస్టర్ గా, ఆ తర్వాత డైరెక్టర్ గా నిరూపించుకున్న రాఘవ లారెన్స్ ఇప్పుడు హీరోగా సెటిల్ అయిపోయాడు. వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే లారెన్స్ నటిస్తున్న రెండు సినిమాలు సెట్స్ పై ఉండగా తాజాగా సీనియర్ డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో మరో సినిమాను ప్రారంభించాడు లారెన్స్.

ఈ చిత్ర ప్రారంభోత్సవం పూజా కార్యక్రమాలు తాజాగా చెన్నైలో జరిగాయి. ఈ సినిమాలో లారెన్స్ తో పాటు అతడి సోదరుడు ఎల్విన్ కూడా ఒక ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.

ఈ సినిమాలో నటించే హీరోయిన్, ఇతర నటీనటుల వివరాల గురించి అతి త్వరలో వెల్లడిస్తామని ఈ మూవీ మేకర్స్ ప్రకటించారు. తమిళంలో నరసింహా వంటి భారీ బ్లాక్ బస్టర్ కు దర్శకత్వం వహించిన కేఎస్ రవికుమార్ కు కొన్నేళ్లుగా సరైన హిట్లు లేవు. ఆయన దర్శకత్వంలో వచ్చిన చివరి హిట్ సినిమా దశావతారం.

ఇటీవలి కాలంలో ఆయన తెలుగులో నందమూరి బాలకృష్ణ హీరోగా రూలర్, జై సింహా సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇందులో జైసింహా సినిమా మాత్రమే పర్వాలేదనిపించింది. ఇప్పుడు రవి కుమార్ లారెన్స్ తో తనకు అచ్చొచ్చిన యాక్షన్ కథాంశంతో సినిమాను రూపొందిస్తున్నాడు.

లారెన్స్ ఈ సినిమాతో పాటు సీనియర్ డైరెక్టర్ పి.వాసు దర్శకత్వంలో చంద్రముఖి-2 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. దీంతోపాటు దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో రుద్రన్ అనే మరో సినిమా చేస్తున్నాడు లారెన్స్. ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తి కాగా క్రిస్మస్ కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

First Published:  27 Jun 2022 2:44 AM GMT
Next Story