Telugu Global
MOVIE UPDATES

మారుతితో సినిమా ప్రకటించిన చిరంజీవి

చిరంజీవి, మారుతి కాంబినేషన్ లో సినిమాపై చర్చ చాలా రోజులుగా జరుగుతోంది. అయితే మధ్యలో ప్రభాస్ ఎంటర్ అవ్వడంతో ప్రభాస్-మారుతి సినిమాపై చర్చ ఊపందుకుంది. చిరంజీవి-మారుతి కాంబినేషన్ కాస్త సైడ్ అయింది. ఇప్పుడా సినిమాపై పూర్తి క్లారిటీ వచ్చేసింది. మారుతితో సినిమా చేయబోతున్నట్టు స్వయంగా చిరంజీవి ప్రకటించారు. పక్కా కమర్షియల్ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు ప్రత్యేక అతిథిగా హాజరైన చిరంజీవి, మారుతితో సినిమా చేస్తున్నానని ఎనౌన్స్ చేశారు. “మారుతి మంచి దర్శకుడు అవుతాడని ఎప్పుడో చెప్పాను. […]

మారుతితో సినిమా ప్రకటించిన చిరంజీవి
X

చిరంజీవి, మారుతి కాంబినేషన్ లో సినిమాపై చర్చ చాలా రోజులుగా జరుగుతోంది. అయితే మధ్యలో ప్రభాస్ ఎంటర్ అవ్వడంతో ప్రభాస్-మారుతి సినిమాపై చర్చ ఊపందుకుంది. చిరంజీవి-మారుతి కాంబినేషన్ కాస్త సైడ్ అయింది. ఇప్పుడా సినిమాపై పూర్తి క్లారిటీ వచ్చేసింది.

మారుతితో సినిమా చేయబోతున్నట్టు స్వయంగా చిరంజీవి ప్రకటించారు. పక్కా కమర్షియల్ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు ప్రత్యేక అతిథిగా హాజరైన చిరంజీవి, మారుతితో సినిమా చేస్తున్నానని ఎనౌన్స్ చేశారు.

“మారుతి మంచి దర్శకుడు అవుతాడని ఎప్పుడో చెప్పాను. చెప్పినట్టుగానే అతడి మంచి దర్శకుడు అయ్యాడు. కొన్ని రోజుల కిందట యూవీ క్రియేషన్స్ బ్యానర్ నుంచి విక్కీ వచ్చి నన్ను కలిశాడు. మారుతితో, మీతో కలిసి సినిమా చేయాలని ఉందంటూ కోరాడు. ఆ సినిమాను ఇప్పుడు ఈ వేదికపై నుంచి కన్ ఫర్మ్ చేస్తున్నాను. మారుతితో నేను సినిమా చేస్తాను.”

ఇలా మారుతి దర్శకత్వంలో సినిమా చేయబోతున్న విషయాన్ని చిరంజీవి కన్ ఫర్మ్ చేశారు. అయితే ఈ ప్రాజెక్టు ఇప్పట్లో సెట్స్ పైకి వచ్చే సూచనలు మాత్రం కనిపించడం లేదు. ఎందుకంటే మెగాస్టార్ చేతిలో చాలా ప్రాజెక్టులున్నాయి.

ప్రస్తుతం గాడ్ ఫాదర్, భోళాశంకర్, బాబి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు చిరంజీవి. ఈ కమిట్ మెంట్స్ పూర్తయిన తర్వాత వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. అది కూడా పూర్తయిన తర్వాత మారుతి సినిమా ఉంటుంది. ఈ గ్యాప్ లో ప్రభాస్ తో సినిమా పూర్తిచేస్తాడు మారుతి.

First Published:  26 Jun 2022 8:45 PM GMT
Next Story