Telugu Global
National

మ‌హారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ ప్రయత్నం

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలపై డిప్యూటీ స్పీకర్ వేసిన అనర్హత వేటు నిర్ణయం మీద‌ సుప్రీం కోర్టు స్టేటస్ కో ఇచ్చింది. సుప్రీం కోర్టు ఈ నిర్ణయం ప్రకటించిన నేపథ్యంలో బీజేపీ తన వ్యూహాలకు పదును పెడుతోంది. ఎలాగైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రణాళికతో మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ అడుగులు వేస్తున్నారు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రణాళికలో భాగంగా కొద్ది సేపటి క్రితం ఫడ్నవీస్ ఇంట్లో బీజేపీ మహారాష్ట్ర అగ్రనాయకుల […]

మ‌హారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ ప్రయత్నం
X

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలపై డిప్యూటీ స్పీకర్ వేసిన అనర్హత వేటు నిర్ణయం మీద‌ సుప్రీం కోర్టు స్టేటస్ కో ఇచ్చింది. సుప్రీం కోర్టు ఈ నిర్ణయం ప్రకటించిన నేపథ్యంలో బీజేపీ తన వ్యూహాలకు పదును పెడుతోంది. ఎలాగైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రణాళికతో మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ అడుగులు వేస్తున్నారు.

మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రణాళికలో భాగంగా కొద్ది సేపటి క్రితం ఫడ్నవీస్ ఇంట్లో బీజేపీ మహారాష్ట్ర అగ్రనాయకుల సమావేశం ప్రారంభమయ్యింది.

ఈ సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు పలువురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. 39 మంది శివసేన రెబల్ ఎమ్మెల్యేలు, ఇండిపెండెంట్లతో కలిపి తమకు 178 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని బీజేపీ చెబుతోంది.

మరో వైపు శివసేన పార్టీని రక్షించుకునే ప్రయత్నంలో ఉద్దవ్ ఠాక్రే వున్నారు. అన్ని జిల్లాల నాయకులు, కార్యకర్తలతో ఉద్దవ్ ఠాక్రేతో పాటు అతని కుమారుడు ఆదిత్య ఠాక్రే కూడా విస్త్రుత సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.

అవసరమైతే ముఖ్యమంత్రి పదవికి రాజీ నామా చేస్తానని కానీ పార్టీని మాత్రం నిలబెట్టుకొని తీరుతానని ఉద్దవ్ ఠాక్రే తన సన్నిహితుల వద్ద అన్నట్టు తెలుస్తోంది.

అయితే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలన్న ఉద్దవ్ ఠాక్రే ను శరద్ పవార్ ఆపినట్టు సమాచారం. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని ఆయన ఉద్దవ్ కు నచ్చచెప్పినట్టు తెలుస్తోంది.

First Published:  27 Jun 2022 8:36 AM GMT
Next Story