Telugu Global
MOVIE UPDATES

రామ్ సినిమాలో మరో స్టార్ హీరో..!

యంగ్ హీరో రామ్ పోతినేని కి టాలీవుడ్ లో చాలా ఏళ్ళు లవర్ బాయ్ ఇమేజే ఉంది. అయితే రామ్ – పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఊర మాస్ గా తెరకెక్కడంతో మాస్ హీరోగా రామ్ కు గుర్తింపు వచ్చింది. దీంతో వరుసగా రామ్ పక్కా మాస్ సినిమాలు మాత్రమే చేస్తున్నారు. ఆ సినిమా తర్వాత రెడ్ అనే సినిమా చేసిన రామ్ ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో ది వారియర్ అనే పేరుతో […]

రామ్ సినిమాలో మరో స్టార్ హీరో..!
X

యంగ్ హీరో రామ్ పోతినేని కి టాలీవుడ్ లో చాలా ఏళ్ళు లవర్ బాయ్ ఇమేజే ఉంది. అయితే రామ్ – పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఊర మాస్ గా తెరకెక్కడంతో మాస్ హీరోగా రామ్ కు గుర్తింపు వచ్చింది. దీంతో వరుసగా రామ్ పక్కా మాస్ సినిమాలు మాత్రమే చేస్తున్నారు.

ఆ సినిమా తర్వాత రెడ్ అనే సినిమా చేసిన రామ్ ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో ది వారియర్ అనే పేరుతో ఒక హై ఓల్టేజ్ మాస్ చిత్రంలో నటిస్తున్నాడు.

ఈ సినిమా తర్వాత యాక్షన్ సినిమాలను బాగా తీయగలడనే పేరు తెచ్చుకున్న బోయపాటి శ్రీనుతో రామ్ ఒక సినిమా చేయనున్నట్టు ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనుంది. అయితే ఈ మూవీ మల్టీస్టారర్ అని తాజాగా తెలిసింది.

ఇందులో రామ్ తో పాటు తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ కూడా ఒక పాత్ర పోషిస్తున్నట్లు తాజా సమాచారం. ఇప్పటికే అనుదీప్ దర్శకత్వంలో ఒక తెలుగు సినిమాలో నటిస్తున్నశివ కార్తికేయన్ వెంటనే మరో తెలుగు సినిమాలో నటించేందుకు అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది.

శివ కార్తికేయన్ తాజాగా నటించిన డాన్ సినిమా తెలుగులో కూడా సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం రామ్ ది వారియర్ సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా కంప్లీట్ అవగానే బోయపాటి కాంబినేషన్లో సినిమా ప్రారంభం కానుంది.

First Published:  27 Jun 2022 12:04 AM GMT
Next Story