Telugu Global
NEWS

టెలిగ్రామ్ ప్రీమియం రాబోతుంది! ప్రత్యేకతలేంటంటే..

వాట్సాప్ మెసేంజర్‌కు పోటీగా నిలుస్తున్న మెసేజింగ్ యాప్ ఏదైనా ఉందంటే అది టెలిగ్రామ్ మాత్రమే. టెలిగ్రామ్ యాప్‌కు ప్రపంచవ్యాప్తంగా ఫుల్ పాపులారిటీ ఉంది. అంతగా సక్సెస్ అయిన టెలిగ్రామ్‌కు ఇప్పుడు ప్రీమియం వెర్షన్ రాబోతుంది. దీని ప్రత్యేకతలేంటంటే.. ఇకపై టెలిగ్రామ్ ఫ్రీ వెర్షన్‌తో పాటు ప్రీమియం వెర్షన్ కూడా అందుబాటులో ఉండబోతోంది. టెక్‌క్రంచ్‌ నివేదిక ప్రకారం దీని మంత్లీ సబ్ స్క్రిప్షన్ చార్జీ రూ.390 ఉండొచ్చని అంచనా.టెలిగ్రామ్ ప్రీమియం వెర్షన్‌లో ఉండే ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో యూజర్లు […]

టెలిగ్రామ్ ప్రీమియం రాబోతుంది! ప్రత్యేకతలేంటంటే..
X

వాట్సాప్ మెసేంజర్‌కు పోటీగా నిలుస్తున్న మెసేజింగ్ యాప్ ఏదైనా ఉందంటే అది టెలిగ్రామ్ మాత్రమే. టెలిగ్రామ్ యాప్‌కు ప్రపంచవ్యాప్తంగా ఫుల్ పాపులారిటీ ఉంది. అంతగా సక్సెస్ అయిన టెలిగ్రామ్‌కు ఇప్పుడు ప్రీమియం వెర్షన్ రాబోతుంది. దీని ప్రత్యేకతలేంటంటే..

ఇకపై టెలిగ్రామ్ ఫ్రీ వెర్షన్‌తో పాటు ప్రీమియం వెర్షన్ కూడా అందుబాటులో ఉండబోతోంది. టెక్‌క్రంచ్‌ నివేదిక ప్రకారం దీని మంత్లీ సబ్ స్క్రిప్షన్ చార్జీ రూ.390 ఉండొచ్చని అంచనా.టెలిగ్రామ్ ప్రీమియం వెర్షన్‌లో ఉండే ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో యూజర్లు 4జీబీ వరకూ ఫైల్స్‌ షేర్ చేసుకోవచ్చు.

నాలుగు గంటల హెచ్‌డీ (1080p) వీడియో లేదా 400 గంటల హైక్వాలిటీ ఆడియోను షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రీమియం టెలిగ్రామ్ యూజర్లు వెయ్యి చానల్స్‌ వరకూ ఫాలో అవ్వొచ్చు. అలాగే 20 చాట్‌ ఫోల్డర్లు ఓపెన్‌ చేసి ఒక్కోదానిలో 200 మందితో గ్రూప్ చాట్ చేసుకోవచ్చు. మెయిన్‌ జాబితాలో పది చాట్స్‌, పది ఫేవరేట్‌ స్టిక్కర్లను సేవ్‌ చేసుకోవచ్చు. 400 వరకు ఫేవరేట్‌ జీఐఎఫ్‌ల యాక్సెస్‌ పొందొచ్చు.

ఇకపోతే టెలిగ్రామ్ ప్రీమియం వెర్షన్‌లో మీడియా ఫైల్స్‌ను చాలా వేగంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. వాయిస్‌ మెసేజ్‌ను టెక్స్ట్‌గా మార్చుకోవచ్చు. డజన్ల కొద్దీ టెలిగ్రామ్‌ స్టిక్కర్లను ఫుల్‌ స్ర్కీన్‌ యానిమేషన్స్‌తో షేర్ చేసుకోవచ్చు. వీటికోసం మంత్లీ అప్‌డేట్స్‌ కూడా ఉంటాయి.

ప్రీమియమ్‌ యూజర్లు చాట్‌ లిస్ట్‌ను ఆర్గనైజ్‌ చేసేందుకు ప్రత్యేకమైన టూల్స్‌ ఉంటాయి. ప్రీమియం యూజర్లకు స్పెషల్‌ బ్యాడ్జ్‌ కూడా లభిస్తుంది. ప్రొఫైల్‌ వీడియోని యానిమేట్‌ చేయొచ్చు. అయితే ప్రీమియంలో భాగంగా ఇన్ని స్పెషల్ ఫీచర్లను అందిస్తున్న టెలిగ్రామ్.. ఉచిత మెసేజింగ్ యాప్ వాట్సాప్‌తో ఏమేరకు పోటీ పడుతుందో చూడాలి.

First Published:  26 Jun 2022 12:21 AM GMT
Next Story