Telugu Global
NEWS

28న టీ-హబ్ 2 ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

దేశంలోనే ప్రతిష్టాత్మకంగా స్టార్టప్‌లకు వేదికగా టీ-హబ్‌ను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. దీనికి అత్యంత ఆదరణ లభించడంతో ప్రాజెక్టును మరింతగా విస్తరించింది. టీ హబ్-2 ఫెసిలిటీని కూడా మొదలుపెట్టి పూర్తి చేసింది. అత్యంత సుందరంగా, ఆధునిక‌ సౌకర్యాలతో నిర్మించిన టీ హబ్-2 ఫెసిలిటీని ఈ నెల 28న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. టీ-హబ్ రెండో దశను రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాతో నిర్మించింది. రాయదుర్గంలోని […]

28న టీ-హబ్ 2 ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
X

దేశంలోనే ప్రతిష్టాత్మకంగా స్టార్టప్‌లకు వేదికగా టీ-హబ్‌ను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. దీనికి అత్యంత ఆదరణ లభించడంతో ప్రాజెక్టును మరింతగా విస్తరించింది. టీ హబ్-2 ఫెసిలిటీని కూడా మొదలుపెట్టి పూర్తి చేసింది. అత్యంత సుందరంగా, ఆధునిక‌ సౌకర్యాలతో నిర్మించిన టీ హబ్-2 ఫెసిలిటీని ఈ నెల 28న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

టీ-హబ్ రెండో దశను రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాతో నిర్మించింది. రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీలో 5.82 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో పూర్తి చేశారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ సెంటర్‌గా తీర్చిదిద్దారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి 2015లో గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో టీ-హబ్ ఏర్పాటు చేశారు. అనుకున్న దాని కన్నా అక్కడ ఎక్కవ ఆదరణ లభించడంతో.. మరింత విశాలమైన ఫెసిలిటీని రాయదుర్గంలో ఏర్పాటు చేశారు.

టీ-హబ్ ద్వారా గత ఏడేళ్లలో 1,800 స్టార్టప్‌లు పురుడు పోసుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 600 కంపెనీలతో టీ-హబ్ పనిచేసింది. ఇక కొత్తగా ఏర్పాటు చేస్తున్న టీ-హబ్-2 లో ఓకేసారి 2వేల స్టార్టప్ కంపెనీలు తమ కార్యకలాపాలు నిర్వహించే వీలుంది. అందుకు తగిన మౌలిక సదుపాయాలను తెలంగాణ ప్రభుత్వం కల్పించింది.

టీ-హబ్ 2 ఫొటోలను ట్విట్టర్‌లో ఉంచడమే కాకుండా.. అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ చెప్పిన సూక్తిని కూడా రాసుకొచ్చారు. ‘భవిష్యత్‌ను ఊహించుకోవాలంటే.. దాన్ని సృష్టించడమే ఉత్తమ మార్గం’ అని చెప్పారు కేటీఆర్‌.

First Published:  26 Jun 2022 1:17 AM GMT
Next Story