Telugu Global
MOVIE UPDATES

నాగార్జున సాయాన్ని ఎన్నటికీ మరిచిపోను

టాలీవుడ్ సీరియర్ హీరో నాగార్జునకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు హీరో సుదీప్. ప్రస్తుతం ఈ హీరో ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. దాని పేరు విక్రాంత్ రోణ. ఆ సినిమాలో నాగార్జునకు కూడా భాగం ఉందని, నాగ్ సహకారం లేకపోతే ఆ సినిమా పూర్తయి ఉండేది కాదంటున్నాడు. ఇంతకీ విక్రాంత్ రోణ కోసం నాగార్జున ఏం చేశాడో తెలుసా? ఈ సినిమాకు నాగ్ డబ్బింగ్ చెప్పలేదు, వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేదు. స్పెషల్ ఎప్పీయరెన్స్ కూడా […]

నాగార్జున సాయాన్ని ఎన్నటికీ మరిచిపోను
X

టాలీవుడ్ సీరియర్ హీరో నాగార్జునకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు హీరో సుదీప్. ప్రస్తుతం ఈ హీరో ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. దాని పేరు విక్రాంత్ రోణ. ఆ సినిమాలో నాగార్జునకు కూడా భాగం ఉందని, నాగ్ సహకారం లేకపోతే ఆ సినిమా పూర్తయి ఉండేది కాదంటున్నాడు.

ఇంతకీ విక్రాంత్ రోణ కోసం నాగార్జున ఏం చేశాడో తెలుసా? ఈ సినిమాకు నాగ్ డబ్బింగ్ చెప్పలేదు, వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేదు. స్పెషల్ ఎప్పీయరెన్స్ కూడా లేదు. కేవలం గేట్లు తెరిచాడంటే. అదేంటో సుదీప్ మాటల్లోనే వినండి.

“కోవిడ్ త‌ర్వాత ఈ సినిమా చేయాల‌ని నాగార్జున‌గారిని అడిగితే మా కోసం గేట్స్ తెరిచారు. అన్న‌పూర్ణ స్టూడియోలో రెండున్న‌ర నెల‌ల‌కు పైగానే చిత్రీక‌రించాం. అన్నీ ఫ్లోర్స్ మాకే ఇచ్చేశారు. కోవిడ్ భ‌యం ఉన్న‌ప్ప‌టికీ .. చాలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నాం. ఓ కోవిడ్ కేసు లేకుండా షూటింగ్‌ను పూర్తి చేశాం. స‌మ‌యం కూడా మాకు స‌పోర్ట్ చేసింది”

ఇలా నాగార్జున చేసిన సహకారాన్ని గుర్తు చేసుకున్నాడు సుదీప్. విక్రాంత్ రోణతో జులై 28న థియేటర్లలోకి రాబోతున్న సుదీప్, ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అవ్వాలనే టార్గెట్ పెట్టుకున్నాడు ఈ సీనియర్ హీరో.

First Published:  26 Jun 2022 1:50 AM GMT
Next Story