Telugu Global
MOVIE UPDATES

‘రంగ రంగ వైభవంగా’ తాజా అప్డేట్..!

తన తొలి సినిమా ఉప్పెనతోనే బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుని తనకంటూ టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్. ఆ తర్వాత తన రెండో సినిమానే ప్రయోగాత్మకంగా విలక్షణ దర్శకుడు క్రిష్ కాంబినేషన్ లో కొండపొలం అనే వైవిధ్యభరితమైన సినిమాలో నటించాడు. వైష్ణవ్ తేజ్ తన మూడో చిత్రాన్ని మాత్రం ఒక యూత్ ఫుల్ చిత్రాన్ని ఎంచుకున్నాడు. రంగ రంగ వైభవంగా అనే పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాకు […]

‘రంగ రంగ వైభవంగా’ తాజా అప్డేట్..!
X

తన తొలి సినిమా ఉప్పెనతోనే బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుని తనకంటూ టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్. ఆ తర్వాత తన రెండో సినిమానే ప్రయోగాత్మకంగా విలక్షణ దర్శకుడు క్రిష్ కాంబినేషన్ లో కొండపొలం అనే వైవిధ్యభరితమైన సినిమాలో నటించాడు.

వైష్ణవ్ తేజ్ తన మూడో చిత్రాన్ని మాత్రం ఒక యూత్ ఫుల్ చిత్రాన్ని ఎంచుకున్నాడు. రంగ రంగ వైభవంగా అనే పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాకు తమిళ అర్జున్ రెడ్డి ఫేమ్ గిరీశయ్య దర్శకత్వం వహిస్తున్నాడు. అతనికి ఇదే తెలుగులో మొదటి సినిమా.

ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు యూట్యూబ్ లో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి.

ఈ సినిమాకు సంబంధించి తాజాగా మరో అప్డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. రేపు ఉదయం 11 గంటలకు రంగ రంగ వైభవంగా టీజర్ ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

రంగ రంగ వైభవంగా సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ పలుమార్లు వాయిదా పడగా, తాజాగా ఈ సినిమాను జులై 1వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. కాగా వైష్ణవ్ తేజ్ ఈ సినిమాతో పాటు సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో ఒక పక్కా మాస్ చిత్రంలో నటిస్తున్నాడు.

First Published:  26 Jun 2022 1:00 AM GMT
Next Story