Telugu Global

ఉపాధ్యాయుల ఆస్తుల వివరాలు…ఉత్తర్వులు ఉపసంహరణ‌

ఉపాధ్యాయులు ఆస్తుల వివరాలివ్వాలంటూ పాఠశాల విద్యా శాఖ ఇచ్చి న ఆదేశాలను ప్రభుత్వం నిలుపుదల చేసింది. ఉపాధ్యాయులు స్థిర, చరాస్తులు ఏవి కొనాలన్నా అమ్మాలన్నా ముందుగా విద్యాశాఖ అనుమతి తీసుకోవాలంటూ, మొత్త ఆస్తుల వివరాలను ప్రతి సంవత్సరం ప్రకటించాలంటూ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ ఆదేశాలను తక్షణం ఆపేస్తున్నట్టు విద్యాశాఖా మంత్రి సబితారెడ్డి శనివారం రాత్రి ప్రకటించారు. ఈ మేరకు వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని ఆమె విద్యా శాఖ కార్యదర్శిని ఆదేశిం చారు. […]

ఉపాధ్యాయుల ఆస్తుల వివరాలు…ఉత్తర్వులు ఉపసంహరణ‌
X

ఉపాధ్యాయులు ఆస్తుల వివరాలివ్వాలంటూ పాఠశాల విద్యా శాఖ ఇచ్చి న ఆదేశాలను ప్రభుత్వం నిలుపుదల చేసింది. ఉపాధ్యాయులు స్థిర, చరాస్తులు ఏవి కొనాలన్నా అమ్మాలన్నా ముందుగా విద్యాశాఖ అనుమతి తీసుకోవాలంటూ, మొత్త ఆస్తుల వివరాలను ప్రతి సంవత్సరం ప్రకటించాలంటూ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ ఆదేశాలను తక్షణం ఆపేస్తున్నట్టు విద్యాశాఖా మంత్రి సబితారెడ్డి శనివారం రాత్రి ప్రకటించారు. ఈ మేరకు వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని ఆమె విద్యా శాఖ కార్యదర్శిని ఆదేశిం చారు.

అసలేం జరిగిందంటే…

నల్గొం డ జిల్లా చం దం పేట మం డలం గుంటిపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న మహమ్మ ద్ జావేద్ అలీ డ్యూటీకి హాజరవకుండ రియల్ ఎస్టేట్ వ్యాపారం, సెటిల్ మెంట్లు చేస్తూ కోట్ల రూపాయలు సంపాదించారని విజిలెన్స్ తేల్చి చెప్పింది. దాంతో అతనిపై చర్యలు తీసుకున్న విద్యాశాఖ‌ ఉపాధ్యాయులందరూ ఆస్తుల వివరాలివ్వాలని, కొనుగోలు అమ్మకాలకు ముందస్తు అనుమతి తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

విద్యాశాఖ జారీ చేసిన ఈ ఆదేశాలు ఉపాధ్యాయుల్లో తీవ్ర కలవరానికి దారి తీసింది. ఉపాధ్యాయ సంఘాలు ఈ ఉత్తర్వులను తీవ్రంగా వ్యతిరేకించాయి. దీనిపై నిన్నంతా హైడ్రామా నడిచింది. చివరకు రాత్రి పొద్దుపోయిన తర్వాత విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఈ ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించడంతో ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు.

First Published:  25 Jun 2022 8:24 PM GMT
Next Story