Telugu Global
NEWS

మరికొన్ని గంటల్లో ఆత్మకూరు ఫలితం.. మెజార్టీపై సస్పెన్స్..

నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితాలు మరికొన్ని గంటల్లో విడుదల కాబోతున్నాయి. ఆత్మకూరులోని ఆంధ్రా ఇంజినీరింగ్ కాలేజీలో ఓట్ల లెక్కింపుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. 20 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ద్వారా కౌంటింగ్ మొదలవుతుంది. కౌంటింగ్ చివర్లో 5 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన వీవీప్యాట్లను కూడా లెక్కిస్తారు. మెజార్టీ ఎంత..? వైసీపీ నేతలు లక్ష మెజార్టీ అంచనా వేస్తున్నారు. అయితే ఆత్మకూరులో మొత్తం పోలయిన […]

మరికొన్ని గంటల్లో ఆత్మకూరు ఫలితం.. మెజార్టీపై సస్పెన్స్..
X

నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితాలు మరికొన్ని గంటల్లో విడుదల కాబోతున్నాయి. ఆత్మకూరులోని ఆంధ్రా ఇంజినీరింగ్ కాలేజీలో ఓట్ల లెక్కింపుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి.

20 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ద్వారా కౌంటింగ్ మొదలవుతుంది. కౌంటింగ్ చివర్లో 5 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన వీవీప్యాట్లను కూడా లెక్కిస్తారు.

మెజార్టీ ఎంత..?
వైసీపీ నేతలు లక్ష మెజార్టీ అంచనా వేస్తున్నారు. అయితే ఆత్మకూరులో మొత్తం పోలయిన ఓట్లు లక్షా 37వేలు మాత్రమే. ఈ క్రమంలో లక్ష మెజార్టీ అంటే అసాధ్యం అనే అంచనాలున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 83 శాతానికి పైగా పోలింగ్ జరిగింది.

తాజాగా పోలింగ్ శాతం 64కి పడిపోయింది. దీంతో భారీ మెజార్టీ కష్టసాధ్యం అంటున్నారు. 2019లో దివంగత నేత వైసీపీ అభ్యర్థి మేకపాటి గౌతమ్ రెడ్డికి 22వేల మెజార్టీ వచ్చింది. ఈసారి ఆయన సోదరుడు విక్రమ్ రెడ్డి మెజార్టీ కచ్చితంగా పెరుగుతుందనే అంచనాలు మాత్రం ఉన్నాయి. మెజార్టీపైనే వైసీపీ భారీ ఆశలు పెట్టుకుంది.

ఆత్మకూరు ఉప ఎన్నికలో మొత్తం 14మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వైసీపీ తరపున మేకపాటి విక్రమ్ రెడ్డి, బీజేపీ తరపున భరత్ కుమార్.. ప్రధాన అభ్యర్థులుగా ఉన్నారు. టీడీపీ, జనసేన పోటీకి దూరంగా ఉన్నాయి. దీంతో సహజంగానే పోలింగ్ శాతం భారీగా తగ్గింది.

కొన్ని చోట్ల బీజేపీకి ఏజెంట్లుగా కూడా టీడీపీ, జనసేన కార్యకర్తలు పనిచేశారంటూ అధికార వైసీపీ ఆరోపిస్తోంది. అయితే మెజార్టీకోసం వైసీపీ.. మంత్రులు, ఎమ్మెల్యేలందర్నీ రంగంలోకి దింపిందని, అయినా విజయం తమదేనని ధీమా వ్యక్తం చేస్తోంది బీజేపీ.

మేకపాటి కుటుంబంపై ఉన్న సింపతీతోపాటు, జగన్ సంక్షేమ పథకాలు.. వైసీపీ విజయాన్ని ఖాయం చేస్తున్నా.. తగ్గిన పోలింగ్ శాతం మెజార్టీని కూడా తగ్గించే అవకాశముందని అంటున్నారు విశ్లేషకులు. లక్ష ఓట్ల మెజార్టీ అసాధ్యం అయినా.. దాదాపు 70వేల ఓట్లతో వైసీపీ ఇక్కడ విజయ ఢంకా మోగించే అవకాశముందనే అంచనాలున్నాయి.

First Published:  25 Jun 2022 9:34 PM GMT
Next Story