Telugu Global
MOVIE UPDATES

రుద్రుడిగా మారిన లారెన్స్

నటుడు-కొరియోగ్రాఫర్-దర్శకుడు రాఘవ లారెన్స్ ప్రస్తుతం కతిరేసన్ దర్శకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి రుద్రుడు అనే టైటిల్‌ను పెట్టారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. పోస్టర్‌లో రాఘవ లారెన్స్ స్టంట్ సీక్వెన్స్‌లో పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. పోస్టర్‌ని బట్టి చూస్తే సినిమాలో ఫుల్ యాక్షన్‌ ఉండేలా ఉంది. ‘ఈవిల్ ఈజ్ నాట్ బోర్న్ , ఇట్ ఈజ్ క్రియేటడ్’ అనేది సినిమా ట్యాగ్‌లైన్. […]

రుద్రుడిగా మారిన లారెన్స్
X

నటుడు-కొరియోగ్రాఫర్-దర్శకుడు రాఘవ లారెన్స్ ప్రస్తుతం కతిరేసన్ దర్శకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి రుద్రుడు అనే టైటిల్‌ను పెట్టారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. పోస్టర్‌లో రాఘవ లారెన్స్ స్టంట్ సీక్వెన్స్‌లో పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. పోస్టర్‌ని బట్టి చూస్తే సినిమాలో ఫుల్ యాక్షన్‌ ఉండేలా ఉంది.

‘ఈవిల్ ఈజ్ నాట్ బోర్న్ , ఇట్ ఈజ్ క్రియేటడ్’ అనేది సినిమా ట్యాగ్‌లైన్. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో లారెన్స్ ఈవిల్ లుక్ లో కనిపించడం ఆసక్తి పెంచింది.

శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తుండగా లారెన్స్ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి శివ-విక్కీ స్టంట్స్ అందిస్తున్నారు.

సినిమా 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ ఏడాది క్రిస్మస్‌ కానుకగా రుద్రుడు సినిమాను ఒకేసారి తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేయాలనుకుంటున్నారు. సినిమాలోని రెండు కీలక పాత్రల్లో భాగ్యరాజ్, నాజర్ కనిపించబోతున్నారు.

First Published:  26 Jun 2022 4:50 AM GMT
Next Story