Telugu Global
MOVIE UPDATES

థియేటర్లలో సందడి.. నెలంతా క్రేజీ సినిమాలే!

కరోనా కారణంగా అగ్ర హీరోలు నటించిన భారీ బడ్జెట్ చిత్రాలన్నీ నెలల తరబడి విడుదలకు నోచుకోలేదు. దీంతో డిసెంబర్ ఆఖరు పుష్ప నుంచి ఇటీవల విడుదలైన ఆచార్య, సర్కారు వారి పాట వరకు వరుసగా అగ్రహీరోలు నటించిన సినిమాలు తెరపైకి వచ్చాయి. వరుసగా పాన్ ఇండియా స్థాయి, భారీ బడ్జెట్ సినిమాలు విడుదల కావడంతో రిలీజ్ కు నోచుకోని పలు క్రేజీ చిత్రాలన్నీ జూలై నెలలో విడుదల కాబోతున్నాయి. ఒకే నెలలో పలు సినిమాలు విడుదల అవుతుండటంతో […]

థియేటర్లలో సందడి.. నెలంతా క్రేజీ సినిమాలే!
X

కరోనా కారణంగా అగ్ర హీరోలు నటించిన భారీ బడ్జెట్ చిత్రాలన్నీ నెలల తరబడి విడుదలకు నోచుకోలేదు. దీంతో డిసెంబర్ ఆఖరు పుష్ప నుంచి ఇటీవల విడుదలైన ఆచార్య, సర్కారు వారి పాట వరకు వరుసగా అగ్రహీరోలు నటించిన సినిమాలు తెరపైకి వచ్చాయి. వరుసగా పాన్ ఇండియా స్థాయి, భారీ బడ్జెట్ సినిమాలు విడుదల కావడంతో రిలీజ్ కు నోచుకోని పలు క్రేజీ చిత్రాలన్నీ జూలై నెలలో విడుదల కాబోతున్నాయి.

ఒకే నెలలో పలు సినిమాలు విడుదల అవుతుండటంతో జూలై మొత్తం థియేటర్ల వద్ద సందడి కనిపించడం ఖాయంగా మారింది. ముందుగా జూలైలో విడుదలయ్యే సినిమాల జాబితాలో గోపిచంద్ హీరోగా నటించిన పక్కా కమర్షియల్ ముందుంది. 1న విడుదలయ్యే ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ అంచనాలు పెంచేసింది.
అలాగే యంగ్ హీరో రామ్, తమిళ మాస్ చిత్రాల దర్శకుడు లింగుస్వామి కాంబినేషన్లో ది వారియర్ అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జూలై 14వ తేదీన తెరపైకి రానుంది. ద్వి భాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇస్మార్ట్ శంకర్, రెడ్ వంటి విజయాల తర్వాత రామ్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రం రిలీజ్ పై ట్రేడ్ లో కూడా ఆసక్తి నెలకొంది.

నిఖిల్ సిద్ధార్థ్ కు స్టార్డం తీసుకువచ్చిన కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న కార్తికేయ-2 జూలై 22వ తేదీ విడుదల కానుంది. ఇటీవల వచ్చిన ఈ మూవీ ట్రైలర్ ఎంతో థ్రిల్, సస్పెన్స్ తో ఉండడంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో అమాంతం అంచనాలు పెరిగాయి. ఇక అదే రోజు వరుసగా నాలుగు చిత్రాలతో విజయాలు అందుకుని మాంచి ఊపు మీద ఉన్న అక్కినేని నాగచైతన్య థాంక్యూ సినిమాతో సందడి చేయనున్నాడు. మనం తర్వాత విక్రమ్ కె కుమార్ -చైతూ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అక్కినేని అభిమానులు ఈ సినిమాపై భారీగానే ఆశలు పెట్టుకున్నారు. ఇక హిట్ సినిమాతో తొలి విజయాన్ని అందుకున్నాడు విశ్వక్ సేన్. దీనికి సీక్వెల్ గా హిట్ -2 సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ సీక్వెల్లో అడివి శేష్ హీరోగా నటిస్తుండటం, ఇటీవల ఆయన నటించిన మేజర్ సినిమా సూపర్ హిట్ కావడంతో హిట్ -2 విడుదల కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా జూలై 29 వ తేదీన విడుదల కానుంది.

ఇక అదే రోజు మాస్ మహారాజా రవితేజ హీరోగా యంగ్ డైరెక్టర్ శరత్ మండవ కాంబినేషన్లో వస్తున్న రామారావు ఆన్ డ్యూటీ కూడా విడుదల కానుంది. అలాగే జూలై 15న సత్యదేవ్- తమన్నా కాంబినేషన్లో వస్తున్న గుర్తుందా శీతాకాలం, 1న టెన్త్ క్లాస్ డైరీస్, షికారు, ఏనుగు, గంధర్వ, 8న హ్యాపీ బర్త్ డే వంటి చిన్న బడ్జెట్ సినిమాలు కూడా విడుదల కానున్నాయి.
డైరెక్ట్ సినిమాలతో పాటు పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఒక హిందీ సినిమా, ఇంకో కన్నడ సినిమా కూడా ఇదే నెలలో సందడి చేయనున్నాయి. రణ్ బీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న షంషేరా 22న, కిచ్చ సుదీప్ హీరోగా నటిస్తున్న విక్రాంత్ రోణ 28వ తేదీన విడుదల కానున్నాయి. ఇలా నెల మొత్తం క్రేజీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి.

First Published:  26 Jun 2022 1:56 AM GMT
Next Story