Telugu Global
MOVIE UPDATES

అది అరుదైన జానర్ సినిమా అంట

యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో రీసెంట్ గా తెలుగులో ఓ కొత్త సినిమా స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. స్వయంగా పవన్ కల్యాణ్ ఈ సినిమా ఓపెనింగ్ కు వచ్చారు. హీరో విశ్వక్ సేన్, హీరోయిన్ ఐశ్వర్య (అర్జున్ కూతురు) పై క్లాప్ కొట్టారు. అయితే ఈ సినిమా జానర్ పై చాలా చర్చ జరుగుతోంది. ప్రీ-లుక్ చూసి చాలామంది ఇది రోడ్ మూవీ అనుకున్నారు. మరికొంతమంది లవ్ రొమాంటిక్ సినిమా అనుకున్నారు. అయితే అర్జున్ మాత్రం […]

అది అరుదైన జానర్ సినిమా అంట
X

యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో రీసెంట్ గా తెలుగులో ఓ కొత్త సినిమా స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. స్వయంగా పవన్ కల్యాణ్ ఈ సినిమా ఓపెనింగ్ కు వచ్చారు. హీరో విశ్వక్ సేన్, హీరోయిన్ ఐశ్వర్య (అర్జున్ కూతురు) పై క్లాప్ కొట్టారు. అయితే ఈ సినిమా జానర్ పై చాలా చర్చ జరుగుతోంది.

ప్రీ-లుక్ చూసి చాలామంది ఇది రోడ్ మూవీ అనుకున్నారు. మరికొంతమంది లవ్ రొమాంటిక్ సినిమా అనుకున్నారు. అయితే అర్జున్ మాత్రం ఇది చాలా అరుదైన జానర్ సినిమా అంటున్నాడు.

“ఇది చాలా ఫీల్ గుడ్ మూవీ. చాలా అరుదైన జోనర్. ఈ కథ చెప్పగానే మరో ఆలోచన లేకుండా నటులు, టెక్నిషియన్స్ ఈ ప్రాజెక్ట్ చేస్తామని చెప్పారు. అందరికీ ఇంత నమ్మకం ఉన్నపుడు కచ్చితంగా అద్భుతమైన సినిమా చేయాలనే భయం ఉంది. మా హీరో విశ్వక్ వండర్ ఫుల్ హీరో. ఈ కథ విన్నాక పిచ్చిపిచ్చిగా నచ్చేసింది అని హీరో విశ్వక్ చెప్పారు. అప్పుడు ఇంకా భాద్యత పెరిగినట్లనిపించింది. వందశాతం మంచి సినిమాని తీస్తాను. ఇది కంప్లీట్ ఎంటర్ టైనర్ ఫీల్ గుడ్ మూవీ.”

ఇలా జానర్ పై మరింత సస్పెన్స్ పెంచేలా మాట్లాడాడు అర్జున్. సినిమా రిలీజైన తర్వాత జానర్ ఏంటో ప్రేక్షకులే చెబుతారని అంటున్నాడు. అర్జున్ కు ఇది దర్శకుడిగా 13వ సినిమా. ఇక నిర్మాతగా అతడికిది 15వ సినిమా.

ఇక అర్జున్ కూతురు ఐశ్వర్యకు ఇదే తొలి తెలుగు సినిమా. ఇంతకుముందు తమిళ్, కన్నడలో చెరో సినిమా చేసింది. ఇప్పుడు తండ్రి దర్శకత్వంలో టాలీవుడ్ కు పరిచయమౌతోంది.

First Published:  26 Jun 2022 3:50 AM GMT
Next Story