Telugu Global
NEWS

అప్పటి విస్కీ అమృతమా..? ఇప్పుడు విషమైపోయిందా..?

మద్యంపై దుష్ట చతుష్టయం విష ప్రచారం చేస్తోందని మండిపడ్డారు మంత్రి అంబటి రాంబాబు. టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా మద్యంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారాయ. మద్యంలో విషపూరిత పదార్థాలున్నట్టు కొంతమంది టీడీపీ నాయకులు ప్రైవేట్ ల్యాబ్ లలో టెస్ట్ లు చేయించినట్టు చెబుతున్నారని, అవన్నీ కుట్రపూరిత ఆరోపణలని అన్నారాయన. విషం మద్యంలో లేదు.. మీ బుర్రలో ఉందంటూ టీడీపీ నేతలపై మండిపడ్డారు అంబటి. ప్రజలను వైసీపీకి దూరం చేయాలనేది ప్రతిపక్షాల కుట్ర అని, మద్యంపై […]

అప్పటి విస్కీ అమృతమా..? ఇప్పుడు విషమైపోయిందా..?
X

మద్యంపై దుష్ట చతుష్టయం విష ప్రచారం చేస్తోందని మండిపడ్డారు మంత్రి అంబటి రాంబాబు. టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా మద్యంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారాయ.

మద్యంలో విషపూరిత పదార్థాలున్నట్టు కొంతమంది టీడీపీ నాయకులు ప్రైవేట్ ల్యాబ్ లలో టెస్ట్ లు చేయించినట్టు చెబుతున్నారని, అవన్నీ కుట్రపూరిత ఆరోపణలని అన్నారాయన. విషం మద్యంలో లేదు.. మీ బుర్రలో ఉందంటూ టీడీపీ నేతలపై మండిపడ్డారు అంబటి.

ప్రజలను వైసీపీకి దూరం చేయాలనేది ప్రతిపక్షాల కుట్ర అని, మద్యంపై తప్పుడు ప్రచారం చేసి, సంక్షేమ కార్యక్రమాలకు అవసరమైన నిధులు లేకుండా చేయాలనేది వారి కుట్ర అని చెప్పారు.

రాష్ట్రంలో ఉన్న 20 డిస్టిలరీలకు గత ప్రభుత్వమే అనుమతి ఇచ్చిందని, వైసీపీ హయాంలో కొత్తగా ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదని గుర్తు చేశారు అంబటి. అప్పటి డిస్టిలరీలే ఇప్పుడు కూడా మద్యం తయారు చేస్తున్నాయని, అప్పటి బ్రాండ్లే ఇప్పుడు కూడా ఉన్నాయని చెప్పారు.

చంద్రబాబు హయాంలో విస్కీ అమృతమా.. అదే విస్కీ వైసీపీ రాగానే విషమైపోయిందా అని ప్రశ్నించారు. మద్యం బాటిళ్లపై ఇది ఆరోగ్యానికి హానికరం అని ఉంటుందని, సిగరెట్ పెట్టెలపై కూడా ఇది క్యాన్సర్ కారకం అని రాసి ఉంటుందనని.. మద్యంలో మంచి మద్యం, సిగరెట్లలో మంచి సిగరెట్లు ఎక్కడైనా ఉంటాయా అని ప్రశ్నించారు అంబటి.

మద్యంలో విషం ఉందంటూ.. ప్రైవేట్ ల్యాబ్‌ లలో పరీక్షించామంటూ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేసే వారిపై అధికారులు చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని కోరారు అంబటి.

కాపురం చేస్తున్నారా లేదా..?
ఏపీలో బీజేపీ, జనసేన కాపురం చేస్తున్నాయా లేదా.. అని ప్రశ్నించారు అంబటి రాంబాబు. తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రచారానికి వచ్చిన పవన్ కల్యాణ్.. బద్వేల్, ఆత్మకూరుకి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. బీజేపీ, జనసేనలో ఎవరు ఎవర్ని పెళ్లి చేసుకున్నారని, అసలు వారి కాపురం సజావుగా సాగుతుందా లేదా అని సెటైర్లు వేశారు.

ఆత్మకూరులో బీజేపీకి టీడీపీ సపోర్ట్ చేయబట్టి ఆమాత్రం ఓట్లయినా వచ్చాయని, అసలు ఏపీలో బీజేపీ సైజ్ ఎంత అని ప్రశ్నించారు అంబటి. ప్రతి ఉప ఎన్నికలోనూ వైసీపీకి మెజార్టీ పెరుగుతూ పోతోందని, ప్రభుత్వానికి మద్దతు పెరుగుతోందని అన్నారు అంబటి.

First Published:  26 Jun 2022 6:40 AM GMT
Next Story