Telugu Global
NEWS

చంద్రబాబుకు కేశినేని నాని వార్నింగ్

విజయవాడ ఎంపీ కేశినేని నాని పరోక్షంగా టీడీపీ అధినాయకత్వానికి వార్నింగ్ ఇచ్చారు. కేశినేని నాని పదేపదే అలగటం, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని చెప్పడం, పరోక్షంగా పార్టీ నాయకత్వంపైనా విమర్శలు చేయడం వంటి పనులు చేస్తున్ననేపథ్యంలో ఇటీవల విజయవాడలో కేశినేని నాని సోదరుడు కేశినేని శివనాథ్ అలియాస్ కేశినేని చిన్నిని టీడీపీ నాయకత్వం ప్రోత్సహిస్తోంది. వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా కేశినేని చిన్నినే పోటీ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. అందుకు తగ్గట్టుగానే కేశినేని నానితో సంబంధం లేకుండా […]

చంద్రబాబుకు కేశినేని నాని వార్నింగ్
X

విజయవాడ ఎంపీ కేశినేని నాని పరోక్షంగా టీడీపీ అధినాయకత్వానికి వార్నింగ్ ఇచ్చారు. కేశినేని నాని పదేపదే అలగటం, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని చెప్పడం, పరోక్షంగా పార్టీ నాయకత్వంపైనా విమర్శలు చేయడం వంటి పనులు చేస్తున్ననేపథ్యంలో ఇటీవల విజయవాడలో కేశినేని నాని సోదరుడు కేశినేని శివనాథ్ అలియాస్ కేశినేని చిన్నిని టీడీపీ నాయకత్వం ప్రోత్సహిస్తోంది.

వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా కేశినేని చిన్నినే పోటీ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. అందుకు తగ్గట్టుగానే కేశినేని నానితో సంబంధం లేకుండా చిన్ని సొంతంగా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేశినేని నాని శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి వచ్చారు.

అక్కడే అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడితో గంటకుపైగా చర్చలు జరిపారు. అనంతరం బయటకు వచ్చిన కేశినేని నాని నేరుగా మైకుల ముందు మాట్లాడేందుకు నిరాకరించారు. ఆఫ్‌ ద రికార్డుగా కీలక వ్యాఖ్యలు చేశారు.

”నా శత్రువును మీరు దగ్గరకు తీసుకుంటే.. నేను మీ శత్రువులను ప్రోత్సహిస్తా.. నా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో.. మీ ఇంటికి నా ఇల్లూ అంతే దూరం” అంటూ వ్యాఖ్యలు చేశారు. తనకు తెలియకుండా, తన స్థానంలో కేశినేని చిన్నిని ప్రోత్సహించడం వల్లనే నానికి కోపం వచ్చినట్టు చెబుతున్నారు. కేశినేని నానికి, సోదరుడు చిన్నికి మధ్య ఆస్తి వివాదాలు ఉన్నట్టు ప్రచారం ఉంది.

First Published:  25 Jun 2022 2:23 AM GMT
Next Story