Telugu Global
NEWS

ప్రభుత్వ టీచర్లు ఆస్తులు ప్రకటించాలి : తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే టీచర్లు ప్రతీ ఏడాది ఆస్తుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశాలిచ్చింది. ఇకపై ప్రభుత్వ ఉపాధ్యాయులు స్థిర, చర ఆస్తులు కొన్నా, అమ్మినా తప్పకుండా అనుమతులు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. టీచర్లు తమ సొంత, కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న భవనాలు, ఇళ్ల స్థలాలు, వాణిజ్య భవనాల వివరాలను వాటి మార్కెట్ ధర ప్రకారం వివరించాలని వివరించారు. స్థిరచరాస్తుల వివరాలను ప్రైమరీ టీచర్లు స్కూల్ […]

ప్రభుత్వ టీచర్లు ఆస్తులు ప్రకటించాలి : తెలంగాణ ప్రభుత్వం
X

తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే టీచర్లు ప్రతీ ఏడాది ఆస్తుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశాలిచ్చింది. ఇకపై ప్రభుత్వ ఉపాధ్యాయులు స్థిర, చర ఆస్తులు కొన్నా, అమ్మినా తప్పకుండా అనుమతులు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. టీచర్లు తమ సొంత, కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న భవనాలు, ఇళ్ల స్థలాలు, వాణిజ్య భవనాల వివరాలను వాటి మార్కెట్ ధర ప్రకారం వివరించాలని వివరించారు.

స్థిరచరాస్తుల వివరాలను ప్రైమరీ టీచర్లు స్కూల్ హెడ్ మాస్టర్‌కు, హైస్కూల్ టీచర్లు ఎంఈవోకు సమర్పించాలని తెలిపారు. ప్రతీ ఏడాది ఇలా సమర్పించిన ఆస్తుల వివరాలను ఆయా జిల్లా విద్యాధికారుల ద్వారా విద్యాశాఖకు పంపాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు టీచర్లు, విద్యాశాఖ ఉద్యోగులందరికీ వివరాలు తెలియజేయాలని ఆర్జేజీ, డీఈవోలకు శనివారం ఆదేశాలు అందాయి.

ఇన్నేళ్లుగా ఉపాధ్యాయుల వ్యక్తిగత ఆస్తుల గురించి పట్టించుకోని తెలంగాణ ప్రభుత్వం ఒక్కసారిగా ఉత్తర్వులు వెలువరించేసరికి అందరిలో ఆందోళన నెలకొంది. అనేక మంది ఉపాధ్యాయులు రియల్ ఎస్టేట్, చిట్టీల‌ వ్యాపారం చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. కొంత మంది పూర్తిగా ఈ వ్యాపారాల కోసం పాఠశాలకు సరిగా హాజరుకావడం లేదని తెలుస్తోంది.

ఇటీవల నల్గొండ జిల్లాలోని ఒక ఉపాధ్యాయుడి వ్యవహారాలపై విజిలెన్స్ శాఖ ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చింది. సాధారణ ఉపాధ్యాయుడికి కోట్లాది రూపాయల ఆస్తులు, ఇతర లావాదేవీలు ఉన్నట్లు తేల్చింది. దీంతో రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరూ తప్పనిసరిగా తమ ఆస్తుల వివరాలను వెల్లడించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది.

Next Story