Telugu Global
NEWS

మత్తు రాని మద్యం కావాలంటున్న టీడీపీ

ఏపీలో మద్యంపై మరోసారి టీడీపీ పాత ఆరోపణలతోనే దాడికి దిగింది. ఆంధ్రా గోల్డ్ విస్కీ, 9సీ హార్స్‌ విస్కీలో ప్రమాదకరమైన కెమికల్స్ ఉన్నాయని.. వీటి వల్ల సూదులతో గుచ్చినట్టు అనిపించడం, అయోమయంగా అనిపించడం, కళ్లు ఎరుపెక్కడం, మానసిక సమస్యలు రావడం జరుగుతుందని టీడీపీ నేతలు ఆనం వెంకటరమణారెడ్డి, అనురాధ ఆరోపించారు. గతంలో శాంపిల్స్‌ ఎక్కడివి అని ప్రభుత్వం ప్రశ్నించిందని.. అందుకే ఇప్పుడు తాము ఏయే మద్యం షాపుల నుంచి శాంపిల్స్‌ సేకరించామన్న దానిపై వివరాలను కూడా టీడీపీ […]

మత్తు రాని మద్యం కావాలంటున్న టీడీపీ
X

ఏపీలో మద్యంపై మరోసారి టీడీపీ పాత ఆరోపణలతోనే దాడికి దిగింది. ఆంధ్రా గోల్డ్ విస్కీ, 9సీ హార్స్‌ విస్కీలో ప్రమాదకరమైన కెమికల్స్ ఉన్నాయని.. వీటి వల్ల సూదులతో గుచ్చినట్టు అనిపించడం, అయోమయంగా అనిపించడం, కళ్లు ఎరుపెక్కడం, మానసిక సమస్యలు రావడం జరుగుతుందని టీడీపీ నేతలు ఆనం వెంకటరమణారెడ్డి, అనురాధ ఆరోపించారు.

గతంలో శాంపిల్స్‌ ఎక్కడివి అని ప్రభుత్వం ప్రశ్నించిందని.. అందుకే ఇప్పుడు తాము ఏయే మద్యం షాపుల నుంచి శాంపిల్స్‌ సేకరించామన్న దానిపై వివరాలను కూడా టీడీపీ వెల్లడించింది. ఈ శాంపిల్స్‌ను చెన్నైలోని ఒక ప్రముఖల్యాబ్‌లో పరీక్షలు చేయించామని.. అందులో చాలా ప్రమాదకరమైన విషపదార్దాలు ఉన్నట్టు తేలిందని టీడీపీ నేతలు వెల్లడించారు.

ప్రభుత్వ మద్యం షాపుల్లో అమ్ముతున్నది నకిలీ మద్యమని దీని వల్ల జన్యుపరమైన సమస్యలకూ అవకాశం ఉందని.. పుట్టబోయే పిల్లలు అంగవైకల్యంతో జన్మించే అవకాశం ఉందని ఆరోపించారు. కోవిడ్ బారిన పడినవారు ఈ మద్యం తాగితే మరింత ప్రమాదమన్నారు.

అయితే మద్యం తాగడమే ఒక చెడు అలవాటు. గతంలో అంబటి రాంబాబు చెప్పినట్టు మద్యంలో మంచి మద్యం అంటూ ఏమీ ఉండదు. తాగేవాడు ఈరోజు కాకుండా పదేళ్లకైనా పోతాడు.. అందుకే తాగవద్దు అని తామూ చెబుతున్నామని మార్చిలో సోమిరెడ్డికి కౌంటర్ ఇచ్చే సమయంలో అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. లిక్కరేమీ ఎనర్జీ డ్రింక్ కాదని దాన్ని తాగవద్దని అంబటి సూచించారు.

మద్యం సేవిస్తే సాధారణంగానే కళ్లు ఎరుపెక్కడం, అయోమయంగా అనిపించడం, నరాల బలహీనత రావడం లాంటి అనేక చెడు ప్రభావాలు ఉంటాయి. ఎక్కడి మద్యం తాగినా అలాంటి లక్షణాలు కనిపించవచ్చు. ఏపీలో మద్యం వల్లనే ఇలాంటి ప్రభావాలుంటాయన్న భావన కలిగించేందుకు టీడీపీ ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. టీడీపీ నేతల ఉద్దేశం ప్రకారం.. మద్యం తాగినా కళ్లు ఎరుపు ఎక్కడం, మత్తు రావడం, కళ్లు తిరగడం, అయోమయంగా అనిపించడం వంటి లక్షణాలు ఉండకూడదన్న మాట.

ఏపీలో అమ్ముతున్న మద్యంలో విష పదార్ధాలున్నాయంటూ మార్చినెలలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా మీడియా సమావేశం పెట్టి ఆరోపణలు చేశారు. అందుకు ఒక ల్యాబ్ రిపోర్టును చూపించారు. అయితే ఏపీ మద్యంలో ఎలాంటి లోపాలు లేవని ప్రభుత్వం ఆధారాలతో అప్పట్లో తిప్పికొట్టడంతో టీడీపీ సైలెంట్ అయింది. ఇప్పుడు టీడీపీ మరోసారి అదే ఆరోపణలు చేయడం విశేషం.

First Published:  25 Jun 2022 7:18 AM GMT
Next Story