Telugu Global
NEWS

యాపిల్ ‘బ్యాక్ టు స్కూల్’ ఆఫర్లపై ఓ లుక్కేయండి.

యాపిల్.. తమ ప్రొడక్ట్స్‌పై అద్భుతమైన ఆఫర్లు ప్రకటించింది. విద్యార్థులు, అధ్యాపకుల కోసం యాపిల్.. తమ ప్రొడక్ట్స్‌పై డిస్కౌంట్ ప్రకటించింది. ‘బ్యాక్ టు స్కూల్’ ఎడ్యుకేషనల్ ప్రైసింగ్ ప్రోగ్రామ్ కింద రకరకాల ఆఫర్లను అనౌన్స్ చేసింది. అవేంటో చూసేద్దామా? సెప్టెంబర్ 22 వరకు అందుబాటులో ఉండే ఈ ఆఫర్లు.. అర్హత కలిగిన విద్యార్థులు, అధ్యాపకులకు వర్తిస్తాయి. ఈ ప్రొగ్రామ్ కింద ఐప్యాడ్ ఎయిర్ 5వ జనరేషన్ రూ.50,780కి కొనుగోలు చేయొచ్చు. అలాగే 11-అంగుళాల ఐప్యాడ్ ప్రో (3వ జనరేషన్) […]

యాపిల్ ‘బ్యాక్ టు స్కూల్’ ఆఫర్లపై ఓ లుక్కేయండి.
X

యాపిల్.. తమ ప్రొడక్ట్స్‌పై అద్భుతమైన ఆఫర్లు ప్రకటించింది. విద్యార్థులు, అధ్యాపకుల కోసం యాపిల్.. తమ ప్రొడక్ట్స్‌పై డిస్కౌంట్ ప్రకటించింది. ‘బ్యాక్ టు స్కూల్’ ఎడ్యుకేషనల్ ప్రైసింగ్ ప్రోగ్రామ్ కింద రకరకాల ఆఫర్లను అనౌన్స్ చేసింది. అవేంటో చూసేద్దామా?

సెప్టెంబర్ 22 వరకు అందుబాటులో ఉండే ఈ ఆఫర్లు.. అర్హత కలిగిన విద్యార్థులు, అధ్యాపకులకు వర్తిస్తాయి. ఈ ప్రొగ్రామ్ కింద ఐప్యాడ్ ఎయిర్ 5వ జనరేషన్ రూ.50,780కి కొనుగోలు చేయొచ్చు. అలాగే 11-అంగుళాల ఐప్యాడ్ ప్రో (3వ జనరేషన్) 12.9 అంగుళాల ఐప్యాడ్ ప్రో (5వ జనరేషన్)ని కూడా తగ్గింపు ధరతో కొనుగోలు చేయొచ్చు. 11వ జనరేషన్ ఐప్యాడ్ ప్రోను రూ. 68,300 ప్రారంభ ధరతో కొనుగోలు చేయొచ్చు.

బ్యాక్ టు స్కూల్ ప్రోగ్రామ్‌లో భాగంగా యాపిల్ కొత్త మ్యాక్ బుక్ ఎయిర్ (MacBook Air M2), మ్యాక్ బుక్ ప్రో (MacBook Pro M2)లపై కూడా డిస్కౌంట్ ప్రకటించింది. మ్యాక్ బుక్ ఎయిర్‌ను రూ.1,09,900కి, మ్యాక్ బుక్ ప్రోని రూ.1,19,900కి కొనుగోలు చేయొచ్చు. అలాగే ఎమ్1 (M1) మ్యాక్‌బుక్ ఎయిర్‌ను రూ. 89,900కే సొంతం చేసుకోవచ్చు.

ఇకపోతే మ్యాక్ లేదా ఐప్యాడ్ మోడల్స్‌లో ఏదైనా కొనుగోలు చేస్తే.. కస్టమర్లు ఉచితంగా ఎయిర్ పాడ్(AirPod)లను సొంతం చేసుకోవచ్చు. యాపిల్ ప్రకటించిన ఈ కొత్త ఎడ్యుకేషన్ ప్రైసింగ్.. యూనివర్సిటీ విద్యార్థులకు, తల్లిదండ్రులకు.. అలాగే అన్ని గ్రేడ్ స్థాయిల అధ్యాపకులు, సిబ్బంది, హోమ్‌స్కూల్ ఉపాధ్యాయులకు అందుబాటులో ఉన్నాయి.

Next Story