Telugu Global
MOVIE UPDATES

సౌత్, నార్త్ దర్శకుల ఫోకస్ మొత్తం టాలీవుడ్ వైపే..!

బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలతో టాలీవుడ్ దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లో విజయాలను అందుకుంది. పాన్ ఇండియా స్థాయి చిత్రాలను నిర్మించే ఇండస్ట్రీగా టాలీవుడ్ ఎదిగింది. తెలుగు హీరోల మార్కెట్ కూడా హిందీ హీరోల స్థాయికి మించి పెరిగింది. దీంతో తెలుగు హీరోలతో సినిమాలు తీసేందుకు ఇతర భాషల అగ్ర దర్శకులు ఆసక్తి చూపుతున్నారు. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇప్పటికే ప్రభాస్ హీరోగా సలార్ అనే సినిమా చేస్తున్నాడు. ఎన్టీఆర్ తో మరో మూవీ […]

director
X

బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలతో టాలీవుడ్ దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లో విజయాలను అందుకుంది. పాన్ ఇండియా స్థాయి చిత్రాలను నిర్మించే ఇండస్ట్రీగా టాలీవుడ్ ఎదిగింది. తెలుగు హీరోల మార్కెట్ కూడా హిందీ హీరోల స్థాయికి మించి పెరిగింది.

దీంతో తెలుగు హీరోలతో సినిమాలు తీసేందుకు ఇతర భాషల అగ్ర దర్శకులు ఆసక్తి చూపుతున్నారు. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇప్పటికే ప్రభాస్ హీరోగా సలార్ అనే సినిమా చేస్తున్నాడు. ఎన్టీఆర్ తో మరో మూవీ కూడా ప్రకటించాడు. చరణ్, అల్లు అర్జున్ ల తో కూడా ప్రశాంత్ సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు.

బాలీవుడ్ లో తానాజీ వంటి హిట్ సినిమా తీసిన ఓం రౌత్ ప్రభాస్ హీరోగా ఆది పురుష్ అనే సినిమా చేస్తున్నాడు. ఇక తమిళ అగ్ర దర్శకుల్లో ఎక్కువమంది తెలుగు హీరోలతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దిగ్గజ దర్శకుడు శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే తమిళ మాస్ సినిమాల దర్శకుడు లింగుస్వామి యంగ్ హీరో రామ్ తో ది వారియర్ అనే సినిమా చేస్తున్నాడు.

మరో అగ్ర దర్శకుడు వెంకట్ ప్రభు నాగచైతన్య హీరోగా ఒక సినిమాను అతి త్వరలో ప్రారంభించనున్నాడు. ఇటీవలే విక్రమ్ సినిమాతో అన్ని భాషల్లో విజయాన్ని అందుకున్న లోకేష్ కనకరాజ్ చరణ్ తో ఓ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఒకసారి చరణ్ ను కలిసి కథ కూడా వినిపించినట్లు సమాచారం.

ఇక తమిళంలో జాతీయ అవార్డు అందుకున్న ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేసేందుకు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. కొద్దిరోజుల కిందట అతడు ఎన్టీఆర్ ను కలసి కథ వినిపించగా, పూర్తిస్థాయి స్క్రిప్టుతో మళ్లీ కలవాలని ఎన్టీఆర్ సూచించినట్లు తెలుస్తోంది. అలాగే దర్శకుడు మురుగదాస్ అల్లు అర్జున్ తో సినిమా చేసేందుకు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఇలా ఇతర భాషలకు చెందిన పలువురు దర్శకులు తెలుగు హీరోలతో సినిమాలు చేసేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు.

First Published:  25 Jun 2022 2:50 AM GMT
Next Story