Telugu Global
MOVIE UPDATES

ఇదొక మిలట్రీ ప్రేమకథ

దుల్కర్ సల్మాన్ హీరోగా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మిస్తున్న చిత్రం ‘సీతా రామం‘. హను రాఘవపూడి దర్శకత్వంలో యుద్ధ నేపధ్యంలో అందమైన ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో మృణాళిని ఠాకూర్ హీరోయిన్ పాత్రలో కనిపించగా రష్మిక కీలకమైన పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం టీజర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో దుల్కర్ సల్మాన్, హను రాఘవపూడి, స్వప్న దత్, […]

ఇదొక మిలట్రీ ప్రేమకథ
X

దుల్కర్ సల్మాన్ హీరోగా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మిస్తున్న చిత్రం ‘సీతా రామం‘. హను రాఘవపూడి దర్శకత్వంలో యుద్ధ నేపధ్యంలో అందమైన ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో మృణాళిని ఠాకూర్ హీరోయిన్ పాత్రలో కనిపించగా రష్మిక కీలకమైన పాత్రలో కనిపించనుంది.

ఈ చిత్రం టీజర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో దుల్కర్ సల్మాన్, హను రాఘవపూడి, స్వప్న దత్, సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఆడియన్స్ సమక్షంలో టీజర్ ను రిలీజ్ చేశారు.

నిమిషం 14 సెకన్ల నిడివిగల ‘సీతా రామం’ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. టీజర్ తొలి సన్నివేశం 1965 కశ్మీర్ మంచు కొండలని చూపిస్తూ .. ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం వాయిస్ తో మొదలైన టీజర్ విజువల్ వండర్ గా నిలిచింది.

”లెఫ్టినెంట్‌ రామ్‌. నిన్ననే నాకు పరిచయమైన పేరు. కశ్మీర్‌ కొండల్లో పహారా కాస్తున్న ఒక ఒంటరి సైనికుడు. తనకు మాట్లాడటానికి ఒక కుటుంబం. కనీసం ఉత్తరం రాయడానికి పరిచయం కూడా లేదన్న విషయం నిన్నే నాకు తెలిసింది’ ఈ వాయిస్ ని ఫాలో అవుతూ చూపించిన విజువల్స్, ఎమోషన్స్ మ్యాజికల్ గా ఉన్నాయి.

లెఫ్టినెంట్‌ రామ్‌ గా దుల్కర్ సల్మాన్ లుక్ బాగుంది. తన గత సినిమాల కంటే ఇందులో మరింత హ్యాండసమ్ గా కనిపిస్తున్నాడు. తనకు వచ్చిన ఉత్తరాలను చూసి ‘సీతా.. ఎవరు నువ్వు?’ అని దుల్కర్ అన్నవెంటనే సంప్రదాయబద్దంగా సీత పాత్ర రివీల్ కావడం హను రాఘవపూడి లవ్లీ మార్క్ గా నిలిచింది. దుల్కర్ సల్మాన్, మృణాళిని ఠాకూర్ ల కెమిస్ట్రీ బాగుంది.

టీజర్ లో ప్రతి ఫ్రేమ్ లావిష్ గా ఉంది. సినిమా విజువల్ వండర్ గా ఉండబోతుందని టీజర్ చూస్తే అర్ధమౌతుంది. పీఎస్ వినోద్ కశ్మీర్ ని మరింత ఆహ్లాదంగా తన కెమెరాతో బంధించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం హార్ట్ టచింగ్ గా ఉంది. యుద్ధంతో రాసిన ఈ ప్రేమకథ.. ఆగస్ట్ 5న వరల్డ్ వైడ్ థియేటర్లలోకి రాబోతోంది.

First Published:  25 Jun 2022 10:14 AM GMT
Next Story