Telugu Global
MOVIE UPDATES

ఆ సినిమాపై అప్ డేట్ లేదా సమంత?

షూటింగ్ పూర్తయి సరిగ్గా 10 నెలలు. ఫస్ట్ లుక్ రిలీజై 4 నెలలు. ఇన్ని నెలలు గడుస్తున్నప్పటికీ శాకుంతలం సినిమాపై ఎలాంటి అప్ డేట్ లేదు. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన తర్వాత ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి మరో ప్రమోషనల్ మెటీరియల్ రిలీజ్ కాలేదు. పూర్తి స్థాయి గ్రాఫిక్స్ తో వస్తోంది శాకుంతలం సినిమా. కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ పనులకు బాగా టైమ్ పడుతుందని యూనిట్ గతంలోనే ప్రకటించింది. ఈ విషయాన్ని అంతా అర్థం చేసుకున్నారు […]

ఆ సినిమాపై అప్ డేట్ లేదా సమంత?
X

షూటింగ్ పూర్తయి సరిగ్గా 10 నెలలు. ఫస్ట్ లుక్ రిలీజై 4 నెలలు. ఇన్ని నెలలు గడుస్తున్నప్పటికీ శాకుంతలం సినిమాపై ఎలాంటి అప్ డేట్ లేదు. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన తర్వాత ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి మరో ప్రమోషనల్ మెటీరియల్ రిలీజ్ కాలేదు.

పూర్తి స్థాయి గ్రాఫిక్స్ తో వస్తోంది శాకుంతలం సినిమా. కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ పనులకు బాగా టైమ్ పడుతుందని యూనిట్ గతంలోనే ప్రకటించింది. ఈ విషయాన్ని అంతా అర్థం చేసుకున్నారు కూడా. కానీ ఈ ప్రాజెక్టు గురించి ప్రేక్షకులు మరిచిపోయేంతలా వ్యవహరించడం మాత్రం కరెక్ట్ కాదు.

సమంత కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా వస్తున్న ఈ సినిమాకు సంబంధించి మినిమం గ్యాప్స్ లో అప్ డేట్స్ ఇవ్వాల్సిన బాధ్యత యూనిట్ పై ఉంది. అప్పుడు మాత్రమే సినిమాపై బజ్ కొనసాగే ఛాన్స్ ఉంటుంది. కానీ యూనిట్ మాత్రం 4 నెలల నుంచి స్తబ్దుగా మారింది.

షూటింగ్ దశలో ఈ సినిమాపై బాగానే హంగామా చేశారు. బన్నీ కూతుర్ని సినిమాలోకి తీసుకున్న టైమ్ లో కూడా హడావుడి బాగానే జరిగింది. ఆ వేడిని ఈ టైమ్ లో కూడా కొనసాగించాల్సిన అవసరం ఉంది. లేదంటే సినిమాపై ఆసక్తి తగ్గిపోవడమే కాదు, బిజినెస్ పై కూడా అది ప్రభావం చూపించే అవకాశం ఉంది.

ఇప్పటికిప్పుడు టీజర్ లేదా ఇంకేదో విడుదల చేయడం కష్టం కావొచ్చు. కానీ వర్కింగ్ స్టిల్స్, పోస్టర్లు విడుదల చేయడం పెద్ద కష్టమేం కాదు. కనీసం పోస్ట్ ప్రొడక్షన్ ఏ స్టేజ్ లో ఉందో చెప్పడం కూడా కష్టమేం కాదు. ఆ దిశగా కూడా ప్రయత్నించడం లేదు యూనిట్.

First Published:  25 Jun 2022 10:20 AM GMT
Next Story