Telugu Global
International

`మై బాడీ- మై చాయిస్` యూఎస్‌లో యువతుల ఆందోళన

అమెరికాలో మహిళలు అబార్షన్‌ చేయించుకునేందుకు 50ఏళ్లుగా ఉన్న రాజ్యాంగపరమైన రక్షణకు ముగింపు పలుకుతూ అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై అమెరికా వ్యాప్తంగా నిరసనలు తీవ్రస్థాయిలో వ్యక్తమవుతున్నాయి. యూఎస్‌ ప్రెసిడెంట్ జో బైడెన్‌ కూడా ఈ తీర్పుపై తీవ్రంగా స్పందించారు. మాజీ అధ్యక్షుడు ఒబామా, ఆయన సతీమణి మిషెల్లి, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ కూడా తీర్పుపై ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్ మాత్రం స్వాగతించారు. అమెరికాలో మహిళలు ముఖ్యంగా యువతులు […]

`మై బాడీ- మై చాయిస్` యూఎస్‌లో యువతుల ఆందోళన
X

అమెరికాలో మహిళలు అబార్షన్‌ చేయించుకునేందుకు 50ఏళ్లుగా ఉన్న రాజ్యాంగపరమైన రక్షణకు ముగింపు పలుకుతూ అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై అమెరికా వ్యాప్తంగా నిరసనలు తీవ్రస్థాయిలో వ్యక్తమవుతున్నాయి.

యూఎస్‌ ప్రెసిడెంట్ జో బైడెన్‌ కూడా ఈ తీర్పుపై తీవ్రంగా స్పందించారు. మాజీ అధ్యక్షుడు ఒబామా, ఆయన సతీమణి మిషెల్లి, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ కూడా తీర్పుపై ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్ మాత్రం స్వాగతించారు.

అమెరికాలో మహిళలు ముఖ్యంగా యువతులు ప్లకార్డులతో రోడ్లపైకి వచ్చారు. మై బాడీ-మై చాయిస్, అబార్షన్ ఈజ్ ఏ హూమన్‌ రైట్‌ అంటూ ప్లకార్డులతో నిరసనకు దిగారు. 50ఏళ్ల క్రితం 1969లో జేన్‌ రో అనే అవివాహిత గర్భం దాల్చింది. ఆమెకు అప్పుడు ఉద్యోగం కూడా లేదు. దాంతో అబార్షన్ చేయించేందుకునే ప్రయత్నించగా..టెక్సస్‌ అధికారులు చట్టవిరుద్ధ‌మంటూ అడ్డుకున్నారు.

దాంతో ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. మూడేళ్ల పాటు కేసును విచారించిన అమెరికా సుప్రీంకోర్టు ఎట్టకేలకు జేన్ రోకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. తీర్పు వచ్చేసరికి అప్పటికే జేన్‌ రో ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

అబార్షన్‌ చేయించుకునే హక్కు మహిళలకు రాజ్యాంగం ప్రకారం ఉందని స్పష్టంచేసింది. రాజ్యాంగ హక్కుల విషయంలో రాష్ట్రాల చట్టాలు పనిచేయవు కాబట్టి .. అప్పటికే పలు రాష్ట్రాల్లో అబార్షన్‌పై ఉన్న ఆంక్షలు కూడా తొలగిపోయాయి.

అయితే తాజాగా తొమ్మిది మందిలో కూడిన అమెరికా సుప్రీంకోర్టు ధర్మాసనం 6-3 మేజారిటీతో అబార్షన్‌ విషయంలో మహిళలకు ఉన్న రాజ్యాంగ రక్షణకు ముగింపు పలుకుతూ తీర్పు ఇచ్చింది.

అబార్షన్‌ను నిషేధించే విషయంలో రాష్ట్రాలు సొంతంగా చట్టాలు అమలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. అబార్షన్‌కు వ్యతిరేకంగా తీర్పునిచ్చిన ఆరుగురు న్యాయమూర్తుల్లో ఐదుగురు పురుషులే కావడం, వారిలో ముగ్గురు ట్రంప్ హయాంలో నియమించిన న్యాయమూర్తులు కావడంతో చర్చ మరో కోణంలోనూ జరుగుతోంది.

ఈ తీర్పును ఆధారంగా చేసుకుని రిపబ్లికన్లు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తక్షణమే మహిళల అబార్షన్ను నిషేధించే అవకాశం ఉంది. ఇటీవల నిర్వహించిన పలు సర్వేల్లో కూడా మహిళలకు అబార్షన్ చేయించుకునే హక్కు ఉండాల్సిందేనని మెజారిటీ పౌరులు అభిప్రాయపడ్డారు. తాజా తీర్పుపై స్పందించిన అధ్యక్షుడు బైడెన్.. ఈ తీర్పు అమెరికాకు, న్యాయస్థానానికి విచారకరమైన రోజు అంటూ అభివర్ణించారు.

ఈ తీర్పును అమెరికన్ల స్వేచ్చపై దాడిగా మాజీ అధ్యక్షుడు ఒబామా అభివర్ణించారు. తీర్పు భయంకరంగా ఉందని, గర్భస్రావానికి చట్టబద్దంగా ఉన్న హక్కును కోల్పోతున్న కోట్లాది మంది అమెరికన్ మహిళల కోపాన్ని, భయాన్ని ఊహించలేం అంటూ కెనడా ప్రధాని ట్రూడో ట్వీట్ చేశారు.

చట్టబద్ద అబార్షన్లను నిషేధిస్తే.. సురక్షితం కానీ అబార్షన్లకు అవకాశం ఏర్పడుతుందని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా అనేక మంది ఈ తీర్పును వ్యతిరేకిస్తుంటే.. మాజీ అధ్యక్షుడు ట్రంప్ మాత్రం తీర్పును స్వాగతించారు. కోట్లాది మంది మహిళలపై ప్రభావం చూపే ఈ తీర్పుకు వ్యతిరేకంగా నిరసనలు మరింత ఊపందుకునే అవకాశం కనిపిస్తోంది.

First Published:  24 Jun 2022 11:16 PM GMT
Next Story