Telugu Global
MOVIE UPDATES

సంక్రాంతి బరిలో మెగాస్టార్..!

వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఇటీవలే ఆచార్యగా ముందుకు వచ్చిన ఆయన ప్రస్తుతం మూడు సినిమాల షూటింగ్ లలో పాల్గొంటున్నాడు. మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్, మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళాశంకర్ చిత్రాల్లో చిరంజీవి హీరోగా నటిస్తున్నాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో కేఎస్ బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య అనే మరో సినిమాలో కూడా చిరంజీవి నటిస్తున్నాడు. ఇందులో చిరంజీవికి జోడీగా శృతిహాసన్ నటిస్తోంది. ప్రస్తుతం చిరంజీవి ఈ […]

chiranjeevi
X

వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఇటీవలే ఆచార్యగా ముందుకు వచ్చిన ఆయన ప్రస్తుతం మూడు సినిమాల షూటింగ్ లలో పాల్గొంటున్నాడు. మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్, మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళాశంకర్ చిత్రాల్లో చిరంజీవి హీరోగా నటిస్తున్నాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో కేఎస్ బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య అనే మరో సినిమాలో కూడా చిరంజీవి నటిస్తున్నాడు.

ఇందులో చిరంజీవికి జోడీగా శృతిహాసన్ నటిస్తోంది. ప్రస్తుతం చిరంజీవి ఈ మూడు సినిమాల షూటింగులలో సమాంతరంగా పాల్గొంటున్నాడు.గాడ్ ఫాదర్ సినిమా దసరా కానుకగా విడుదల అవుతుండగా, భోళా శంకర్ సినిమా ఈ ఏడాది ఆఖరులోగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా వాల్తేరు వీరయ్య సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు మైత్రి మూవ మేకర్స్ సంస్థ ప్రకటించింది.

ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ‘కలుద్దాం సంక్రాంతికి.. జనవరి 2023.. అని ఒక పోస్టర్ విడుదల చేసింది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 40 శాతం మేర పూర్తయింది. ఈ మూవీ తదుపరి షెడ్యూల్ జూలై లో ప్రారంభం కానుంది.చిరంజీవి చాలా రోజుల తర్వాత ఒక పక్కా మాస్ సినిమాలో నటిస్తున్నాడు. స్వయంగా అభిమాని అయిన బాబీ చిరును అభిమానులు తెరపై ఏ విధంగా చూడాలనుకుంటున్నారో అదేవిధంగా తీర్చిదిద్దుతున్నాడు. వాల్తేరు వీరయ్య సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Next Story