Telugu Global
National

2024 ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు… నరేంద్ర మోడీనిర్ణయం… కర్నాటక మంత్రి వెల్లడి

2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు ఏర్పడతాయని, కొత్త రాష్ట్రాల్లో ఉత్తర కర్ణాటక కూడా ఉంటుందని కర్ణాటక మంత్రి ఉమేష్ కత్తి చెప్పారు. “2024 ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయించారు. దానిపై ఆయన ఆలోచిస్తున్నట్లు నాకు తెలిసింది” అని ఆహారం, పౌర సరఫరాలమంత్రి ఉమేష్ కత్తి బెలగావిలో విలేకరులతో అన్నారు. ఏళ్ల తరబడి జనాభా భారం పెరిగిపోతున్నందున రాష్ట్ర విభజన ఆలోచన మంచిదేనని కత్తి […]

2024 ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు… నరేంద్ర మోడీనిర్ణయం… కర్నాటక మంత్రి వెల్లడి
X

2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు ఏర్పడతాయని, కొత్త రాష్ట్రాల్లో ఉత్తర కర్ణాటక కూడా ఉంటుందని కర్ణాటక మంత్రి ఉమేష్ కత్తి చెప్పారు. “2024 ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయించారు. దానిపై ఆయన ఆలోచిస్తున్నట్లు నాకు తెలిసింది” అని ఆహారం, పౌర సరఫరాలమంత్రి ఉమేష్ కత్తి బెలగావిలో విలేకరులతో అన్నారు.

ఏళ్ల తరబడి జనాభా భారం పెరిగిపోతున్నందున రాష్ట్ర విభజన ఆలోచన మంచిదేనని కత్తి అన్నారు.

“జనాభా పెరుగుతోంది కాబట్టి ఇలాంటి ఆలోచన మంచిదే, ఉత్తర కర్ణాటక కూడా అభివృద్ధి చెందాలి. ఉత్తర కర్ణాటక రాష్ట్రంగా మారి అభివృద్ధి చెందాలి. రాష్ట్రం (కర్ణాటక) విడిపోయినా నష్టం లేదు. మనంద‌రం కన్నడిగులుగానే ఉంటాం” అని ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కత్తి అన్నారు.
జనాభా పెరుగుదల దృష్ట్యా 50 రాష్ట్రాలను ఏర్పాటు చేయాలనే ఆలోచన మంచిదేనన్న కత్తి గత 60 ఏళ్లలో కర్నాటక జనాభా రెండు కోట్ల నుంచి 6.5 కోట్లకు పెరిగిందన్నారు.

“కర్ణాటక నుండి రెండు రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్‌లో నాలుగు, మహారాష్ట్రలో మూడు రాష్ట్రాలు ఏర్పడబోతున్నాయి” అని మంత్రి అన్నారు.

కత్తి ప్రకటనపై ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందిస్తూ, ఉత్తర కర్ణాటకకు ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రభుత్వ స్థాయిలో ఎటువంటి ప్రతిపాదన లేదని అన్నారు.ఉమేష్ కత్తి మాట్లాడటం ఇదే మొదటిసారి కాదు.. చాలా ఏళ్లుగా చెబుతున్నారని.. ఈ ప్రశ్నకు ఆయనే సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రి న్యూఢిల్లీలో విలేకరులతో అన్నారు.

కర్నాటక దేవాదాయ శాఖ మంత్రి ఆర్‌.అశోక మాట్లాడుతూ కత్తి ప్రకటన ఏమాత్రం సమస్య కాదన్నారు. “కత్తి ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్రం గురించి మాట్లాడటం ఇది మొదటిసారి కాదు, అతను ఇప్పటివరకు వందల‌ సార్లు ఈ విషయం మాట్లాడాడు. కర్ణాటక ఎప్పటికీ ఒకటిగానే ఉంటుంది. చాలా మంది కన్నడిగులు సమైక్య కర్ణాటక ఏర్పాటు కోసం పోరాడారు.” అని అశోక్ బెంగళూరులో అన్నారు.

First Published:  24 Jun 2022 8:38 PM GMT
Next Story