Telugu Global
MOVIE UPDATES

కడువా టీజర్ ఎలా ఉందో తెలుసా?

మలయాళ సూపర్‌స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, మాస్ డైరెక్టర్ షాజీ కైలాస్ కాంబినేషన్ తెరకెక్కిన హై ఆక్టేన్ యాక్షన్ మాస్ ఎంటర్‌టైనర్ కడువా. మ్యాజిక్ ఫ్రేమ్స్, పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఈ సినిమాను స్వయంగా పృధ్వీరాజ్ నిర్మించాడు. ఈ భారీ యాక్షన్ థ్రిల్ డ్రామాలో బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్‌ మరో ప్రధాన పాత్ర పోషిస్తుండగా, ‘భీమ్లా నాయక్’ ఫేమ్ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. పాన్ ఇండియా ఎంటర్‌టైనర్‌గా మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ […]

కడువా టీజర్ ఎలా ఉందో తెలుసా?
X

మలయాళ సూపర్‌స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, మాస్ డైరెక్టర్ షాజీ కైలాస్ కాంబినేషన్ తెరకెక్కిన హై ఆక్టేన్ యాక్షన్ మాస్ ఎంటర్‌టైనర్ కడువా. మ్యాజిక్ ఫ్రేమ్స్, పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఈ సినిమాను స్వయంగా పృధ్వీరాజ్ నిర్మించాడు.

ఈ భారీ యాక్షన్ థ్రిల్ డ్రామాలో బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్‌ మరో ప్రధాన పాత్ర పోషిస్తుండగా, ‘భీమ్లా నాయక్’ ఫేమ్ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. పాన్ ఇండియా ఎంటర్‌టైనర్‌గా మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో వస్తున్న ‘ కడువా’ జూన్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

ఈ చిత్రం టీజర్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. పృథ్వీరాజ్, వివేక్ ఒబెరాయ్‌, సంయుక్త మీనన్ ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.

హైఆక్టేన్ యాక్షన్ ఎలిమెంట్స్ తో ఫుల్ పవర్ ప్యాక్డ్ గా అలరించింది ‘కడువా’ టీజర్.’ ఆయనొక చిరుత .. వేట కోసం కాచుకున్న చిరుత’ అనే పవర్ ఫుల్ డైలాగ్ తో వీర్ లెవల్ లో పృథ్వీరాజ్ ఇచ్చిన మాస్ ఎంట్రీ సాలిడ్ గా ఉంది. పృథ్వీరాజ్ యాక్షన్, మాస్ లుక్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి.

మరో పవర్ ఫుల్ పోలీసు పాత్రలో వివేక్ ఒబెరాయ్‌ కనిపించారు. యాక్షన్ సీక్వెన్స్ అన్నీ అవుట్ స్టాండింగ్ అనిపించాయి. టీజర్ చివర పృథ్వీరాజ్ పులిలా గర్జించడం మాస్ ని మెస్మరైజ్ చేస్తుంది.

డైరెక్టర్ షాజీ కైలాస్ కడువాతో మరోసారి తన మాస్ మార్క్ ని చూపించబోతున్నారని టీజర్ చూస్తే అర్ధమౌతుంది. నిర్మాణ విలువలు ఉన్నంతగా ఉన్నాయి. అభినందన్ రామానుజం అందించిన విజువల్స్ రిచ్ అండ్ లావిష్ గా వున్నాయి. జేక్స్ బిజోయ్ అందించిన నేపధ్య సంగీతం మాస్ ఎలిమెంట్ ను మరింత ఎలివేట్ చేసింది. పృధ్విరాజ్ నుంచి వస్తున్న మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా ఇదే. తెలుగులో కూడా ఈ సినిమాకు కడువా అనే మలయాళం టైటిల్ నే ఉంచారు.

First Published:  25 Jun 2022 10:23 AM GMT
Next Story