Telugu Global
Health & Life Style

రోజుకి ఎన్ని అడుగులు వేయాలంటే..

నడకతో పూర్తి ఆరోగ్యంగా ఉండొచ్చని డాక్టర్లు చెప్తున్నారు. వ్యాయామం చేయడం కుదరని వారు కేవలం నడవడం ద్వారా ఫిట్‌గా ఉండొచ్చు. అయితే ఈ నడక ఎలా ఉండాలి? రోజుకి ఎన్ని అడుగులు వేయాలి? రోజుకి వేసే అడుగులను బట్టి శారీరక శ్రమను లెక్కించొచ్చు. అందుకే ఇప్పుడొస్తున్న స్మార్ట్ వాచీల్లో కూడా అడుగులను లెక్కించే ఫీచర్ ఇస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో రోజుకు 10 వేల అడుగులు నడిస్తే ఆరోగ్యానికి మంచిదనే ప్రచారం మొదలైంది. అయితే ఇందులో ఎంతవరకూ […]

రోజుకి ఎన్ని అడుగులు వేయాలంటే..
X

నడకతో పూర్తి ఆరోగ్యంగా ఉండొచ్చని డాక్టర్లు చెప్తున్నారు. వ్యాయామం చేయడం కుదరని వారు కేవలం నడవడం ద్వారా ఫిట్‌గా ఉండొచ్చు. అయితే ఈ నడక ఎలా ఉండాలి? రోజుకి ఎన్ని అడుగులు వేయాలి? రోజుకి వేసే అడుగులను బట్టి శారీరక శ్రమను లెక్కించొచ్చు.

అందుకే ఇప్పుడొస్తున్న స్మార్ట్ వాచీల్లో కూడా అడుగులను లెక్కించే ఫీచర్ ఇస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో రోజుకు 10 వేల అడుగులు నడిస్తే ఆరోగ్యానికి మంచిదనే ప్రచారం మొదలైంది. అయితే ఇందులో ఎంతవరకూ వాస్తవం ఉందో తెలుసుకునేందుకు ‘మసాచుసెట్స్’ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఓ సర్వేను నిర్వహించారు. ఇందులో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడ్డాయి.

రోజుకి నాలుగు వేల నుంచి పది వేల అడుగులు వేసేవాళ్ల అందరిపై సైంటిస్టులు ఓ సర్వే నిర్వహించారు. రోజుకి ఐదు వేల అడుగులు నడిచే వారిని “లోస్టెప్‌” అని, 7 నుంచి 9 వేల అడుగులు నడిచే వారిని “మోడరేట్‌” అని, అంతకన్నా ఎక్కువ నడిచే వారిని “హై వాల్యూమ్‌” అని గ్రూపులుగా విడదీశారు. ఇలా మూడు గ్రూపులకు చెందిన రెండువేల మందిపై చేసిన అధ్యయనంలో మోడరేట్, హై వాల్యూమ్ గ్రూపుల మధ్య ఆరోగ్యపరంగా ఎలాంటి తేడా లేదని గమనించారు.

ఏడు వేల కంటే ఎక్కువగా నడిచేవారి ఆరోగ్యం, ఐదు వేల అడుగులు వేసేవారి ఆరోగ్యం ఒకేలా ఉంటున్నట్టు సర్వేలో తేలింది. అంతేకాకుండా రోజూ పదివేల అడుగుల కంటే ఎక్కువ దూరం నడిచేవారిలో కొత్తగా ఆరోగ్య ప్రయోజనాలేమీ కనిపించలేదట. దీన్ని బట్టి ఫిట్‌గా ఉండడం కోసం రోజుకి 5 నుంచి 7 అడుగుల నడక సరిపోతుందని వారు తేల్చారు.

చివరిగా శాస్త్రవేత్తలు తేల్చిందేంటంటే.. వీలైనన్ని ఎక్కువ అడుగులు వేయడం ద్వారా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. బరువు కూడా తగ్గొచ్చు. అయితే 10 వేల అడుగుల వల్ల ఎలాంటి ప్రత్యేకమైన లాభాలు లేవని వారు వెల్లడించారు. రోజుకి 7 వేల అడుగులు వేయడం ద్వారా ఎక్కువకాలం జీవించే అవకాశాలు 50 నుంచి 70 శాతం వరకూ ఉన్నాయని వారు చెప్తున్నారు.

First Published:  25 Jun 2022 1:35 AM GMT
Next Story