Telugu Global
MOVIE UPDATES

చైతూ విడుదల తేదీకి లావణ్య సినిమా

ఎప్పుడైతే నాగచైతన్య నటించిన థాంక్యూ సినిమా విడుదల వాయిదా పడిందో, ఆ వెంటనే జులై 8 తేదీపై చాలా సినిమాలు కన్నేశాయి. వీటిలో మొదటి వరసలో నిలిచిన సినిమా హ్యాపీ బర్త్ డే. సరికొత్త పాత్రలు, విభిన్న కథా నేపథ్యంతో ఆసక్తి కలిగిస్తున్న సినిమా “హ్యాపీ బర్త్ డే”. హీరోయిన్ లావణ్య త్రిపాఠీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని మత్తువదలరా ఫేమ్, దర్శకుడు రితేష్ రానా రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ […]

Lavanya happy birthday
X

ఎప్పుడైతే నాగచైతన్య నటించిన థాంక్యూ సినిమా విడుదల వాయిదా పడిందో, ఆ వెంటనే జులై 8 తేదీపై చాలా సినిమాలు కన్నేశాయి. వీటిలో మొదటి వరసలో నిలిచిన సినిమా హ్యాపీ బర్త్ డే.

సరికొత్త పాత్రలు, విభిన్న కథా నేపథ్యంతో ఆసక్తి కలిగిస్తున్న సినిమా “హ్యాపీ బర్త్ డే”. హీరోయిన్ లావణ్య త్రిపాఠీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని మత్తువదలరా ఫేమ్, దర్శకుడు రితేష్ రానా రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్‌ సంయుక్తంగా నిర్మించాయి.

ఈ థ్రిల్లింగ్ ఎంటర్ టైనర్ మూవీ అనుకున్న తేదీకి వారం ముందుగానే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ముందుగా “హ్యాపీ బర్త్ డే” సినిమా జూలై 15న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే తాజాగా చిత్ర రిలీజ్ డేట్ ను జూలై 8కి మార్చారు. ప్రపంచవ్యాప్తంగా హ్యాపీ బర్త్ డే సినిమా జూలై 8న విడుదల కాబోతోందన్న మాట.

ఈ సినిమాలో నరేష్ ఆగస్త్య, సత్య, వెన్నెల కిషొర్, గుండు సుదర్శన్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌ వైవిధ్యంగా ఉండి ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. ఒక్కొక్కటిగా రివీల్ చేస్తున్న లీడ్ క్యారెక్టర్స్ కూడా సరికొత్తగా ఉండి ఆకట్టుకుంటున్నాయి.

“హ్యాపీ బర్త్ డే” చిత్రానికి కాలభైరవ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. రీసెంట్ గా సరైన సక్సెస్ లేక అవస్థలు పడుతున్న లావణ్య త్రిపాఠి ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా సక్సెస్ అయితే ఆమె కెరీర్ ఇంకొన్నాళ్లు కొనసాగుతుంది.

First Published:  25 Jun 2022 10:09 AM GMT
Next Story