Telugu Global
National

మోడీపై గుజరాత్ అల్లర్ల కేసును కొనసాగించిన తీస్తా సెతల్వాద్‌ అరెస్ట్

ఉద్యమకారిణి తీస్తా సెతల్వాద్‌ను ముంబైలో గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) అరెస్టు చేసింది. గుజ‌రాత్ అల్లర్ల కేసులో ప్రదాని నరేందర్ మోడీ కి సుప్రీం కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ విషయంపై హోం మంత్రి అమిత్ షా…. సెతల్వాద్ 2002 గుజరాత్ అల్లర్ల గురించి పోలీసులకు నిరాధారమైన సమాచారం ఇచ్చారని, సెతల్వాద్‌కు ఎన్‌జీవో ఉందని, అది బీజేపీ కార్యకర్తలపై కావాలనే పోలీస్ స్టేషన్‌లలో పిర్యాదులు చేసిందని అమిత్ షా ఆరోపించిన కొన్ని […]

మోడీపై గుజరాత్ అల్లర్ల కేసును కొనసాగించిన  తీస్తా సెతల్వాద్‌ అరెస్ట్
X

ఉద్యమకారిణి తీస్తా సెతల్వాద్‌ను ముంబైలో గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) అరెస్టు చేసింది.
గుజ‌రాత్ అల్లర్ల కేసులో ప్రదాని నరేందర్ మోడీ కి సుప్రీం కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ విషయంపై హోం మంత్రి అమిత్ షా…. సెతల్వాద్ 2002 గుజరాత్ అల్లర్ల గురించి పోలీసులకు నిరాధారమైన సమాచారం ఇచ్చారని, సెతల్వాద్‌కు ఎన్‌జీవో ఉందని, అది బీజేపీ కార్యకర్తలపై కావాలనే పోలీస్ స్టేషన్‌లలో పిర్యాదులు చేసిందని అమిత్ షా ఆరోపించిన కొన్ని గంటలకే గుజరాత్ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఆమెతోపాటు అహ్మదాబాద్‌లోని డిటెక్షన్ ఆఫ్ క్రైమ్ బ్రాంచ్ (DCB) రిటైర్డ్ DGP RB శ్రీకుమార్ ను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

పోలీస్ ఇన్‌స్పెక్టర్ డిబి బరాద్ ఫిర్యాదు ఆధారంగా, డిటెక్షన్ ఆఫ్ క్రైమ్ బ్రాంచ్ శనివారం శ్రీకుమార్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది, మరో కేసులో జైలులో ఉన్న ఐపిఎస్ అధికారి సంజీవ్ భట్ పై కూడా ఫోర్జరీ, కుట్ర, ఐపిసిలోని ఇతర సెక్షన్ల ఆరోపణలను నమోదు చేసింది.

గుజరాత్ ఏటీఎస్ పోలీసులు తమ‌పై దాడి చేశారని సెతల్వాద్ తరపు న్యాయవాది విజయ్ హిరేమత్ ఆరోపించారు. “పోలీసులు మాకు సమాచారం ఇవ్వలేదు. ఇంట్లోకి చొరబడి ఆమెపై దాడి చేసి అరెస్టు చేసి తీసుకెళ్లారు.” అని విజయ్ హిరేమత్ తెలిపారు.

శ్రీకుమార్, భట్, సెతల్వాద్‌లపై ఐపీసీ 468, 471, 194, 211, 218, 120బి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసులు ఎఫ్‌ఐఆర్ లో సుప్రీం కోర్టు తీర్పు నుండి కొన్ని భాగాలను పొందుపర్చారు.

2002 గుజరాత్ అల్లర్ల సమయంలో పోలీసులు తమ విధులను నిర్వహించకుండా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుందని శ్రీకుమార్ ఆరోపించగా, అల్లర్లలో తన పాత్రపై అప్పటి ముఖ్యమంత్రి మోడీకి వ్యతిరేకంగా భట్ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు.

అల్లర్లకు సంబంధించిన కేసుల్లో అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ, ఇతరులకు సిట్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ, అప్పటి అల్లర్లలో మరణించిన కాంగ్రెస్ మాజీ ఎంపీ ఎహసాన్ జాఫ్రీ భార్య జకియా జాఫ్రీ వేసిన పిటిషన్ ను శుక్రవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది.

First Published:  25 Jun 2022 8:40 AM GMT
Next Story