Telugu Global
National

రాష్ట్రపతి ఎన్నికలో సునాయాసంగా ద్రౌపది ముర్ము విజయం ?

రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము సునాయాసంగా విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బిజూ జనతాదళ్, వైఎస్సార్సీపీ పార్టీల మద్దతుతో ఆమె గెలుపు తథ్యమనే అభిప్రాయాలు వినవస్తున్నాయి. బీహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ-యూ కూడా ఆమెకు సపోర్ట్ ప్రకటించింది. ఎలెక్టోరల్ కాలేజీలోని 10,86,431 ఓట్లలో ఎన్డీయేకి 5,32,351 ఓట్లు.. అంటే 49 శాతం ఓట్లున్నాయి. వైఎసార్సీపీకి 45,550 ఓట్లు ఉండగా బిజూ జనతాదళ్ కి 31,686 ఓట్లు ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. అలాగే […]

రాష్ట్రపతి ఎన్నికలో సునాయాసంగా ద్రౌపది ముర్ము విజయం ?
X

రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము సునాయాసంగా విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బిజూ జనతాదళ్, వైఎస్సార్సీపీ పార్టీల మద్దతుతో ఆమె గెలుపు తథ్యమనే అభిప్రాయాలు వినవస్తున్నాయి. బీహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ-యూ కూడా ఆమెకు సపోర్ట్ ప్రకటించింది.

ఎలెక్టోరల్ కాలేజీలోని 10,86,431 ఓట్లలో ఎన్డీయేకి 5,32,351 ఓట్లు.. అంటే 49 శాతం ఓట్లున్నాయి. వైఎసార్సీపీకి 45,550 ఓట్లు ఉండగా బిజూ జనతాదళ్ కి 31,686 ఓట్లు ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. అలాగే ఆలిండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం (ఏఐఏడీఎంకె) పార్టీకి 14,940 ఓట్లున్నాయి. ద్రౌపది ముర్ము ఎన్నిక కావాలంటే వైఎస్సార్సీపీ, లేదా బీజేడీ మద్దతు ఉంటే చాలునంటున్నారు.

ఇక ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జెఎంఎం) సపోర్టును కూడా ఎన్డీయే కోరే సూచనలున్నాయి. విపక్షాలు తమ ఉమ్మడి అభ్యర్థిగా మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హాను నిలబెట్టగా.. ఈ పార్టీల కన్నా.. సంథాల్ గిరిజన తెగకు చెందిన ముర్ముకే జెఎంఎం మద్దతునిచ్చే సూచనలున్నట్టు తెలుస్తోంది. పైగా టీడీపీ, శిరోమణి అకాలీదళ్, బహుజన్ సమాజ్ పార్టీవంటివి కూడా తమ అభ్యర్థికి ఓటు వేయవచ్చునని భావిస్తున్నామని బీజేపీ నేత ఒకరు తెలిపారు.

ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వం పట్ల అనేక పార్టీలు సానుకూలంగా ఉన్నాయని, పార్టీలకు అతీతంగా పలువురు నాయకులు ఆమెను ఈ పదవికి ఎంపిక చేయడంపట్ల హర్షం వ్యక్తం చేయడంలో ఆశ్చర్యం లేదని ఆయన చెప్పారు. బీజేపీ వ్యతిరేక పార్టీలు కూడా ముర్ము కు మద్దతునిచ్చేందుకు సుముఖంగా ఉన్నాయన్నారు.

అయితే ఎన్డీయేకి . మెజారిటీకి అవసరమైనన్ని ఓట్లు .. అంటే దాదాపు 10,865 ఓట్లు తక్కువగా ఉన్నాయని, కానీ బీజేడీ, వైఎస్సార్సీ వంటి మిత్రపార్టీల ఓట్లను కూడా పరిగణనలోకి తీసుకుంటామని ఆయన తెలిపారు. ఇక మహారాష్ట్రలో రెబెల్ శివసేన నేత ఏక్ నాథ్ షిండే వర్గంలోని ఎమ్మెల్యేల మద్దతు సైతం తమకు ఉంటుందని భావిస్తున్నామన్నారు.

ఎలెక్టోరల్ కాలేజీ.. 543 లోక్ సభ, 233 రాజ్యసభ, సభ్యుల ఓట్లను, అలాగే 4,033 అసెంబ్లీ సభ్యుల ఓట్లను కలిగి ఉంది. లోక్ సభ, రాజ్యసభలో కూడా ఎన్డీయే బలం ఎక్కువగా ఉన్నప్పటికీ చిన్నపార్టీల నుంచి, ఇండిపెండెంట్ల నుంచి మద్దతును కోరుతోంది.

పార్టీలకు అతీతంగా సభ్యులంతా ముర్ముకు మద్దతునివ్వాలని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కోరగా.. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సైతం.. ముర్ము ఎంపిక పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఓ గిరిజన కుటుంబం నుంచి వచ్చిన ముర్మును దేశ అత్యున్నత పదవికి అభ్యర్థిగా ఎంపిక చేయడం హర్షదాయకమని జేడీ-యూ నేత కూడా అయిన నితీష్ కుమార్ వ్యాఖ్యానించారు.

First Published:  25 Jun 2022 12:59 AM GMT
Next Story