Telugu Global
MOVIE UPDATES

గోపీచంద్ కోసం రంగంలోకి చిరంజీవి

దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం పక్కా కమర్షియల్. అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. బ‌న్నీ వాస్ నిర్మాత‌గా గోపీచంద్ హీరోగా వస్తున్న పక్కా కమర్షియల్ సినిమాపై ఓ మోస్తరు అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ ప్లాన్ చేశారు. రేపు ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లో జరగనుంది. మెగాస్టార్ చిరంజీవి […]

గోపీచంద్ కోసం రంగంలోకి చిరంజీవి
X

దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం పక్కా కమర్షియల్. అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. బ‌న్నీ వాస్ నిర్మాత‌గా గోపీచంద్ హీరోగా వస్తున్న పక్కా కమర్షియల్ సినిమాపై ఓ మోస్తరు అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ ప్లాన్ చేశారు.

రేపు ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లో జరగనుంది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా ఈ వేడుక ఘనంగా జరగనుంది. చిత్రయూనిట్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నారు. సినిమా ప్రచారానికి సంబంధించి ఇదే చివరి గ్రాండ్ ఈవెంట్.

ఈ సినిమాలో గోపీచంద్ ‌ను డిఫరెంట్ గా చూపిస్తున్నాడు మారుతి. అలాగే రాశీ ఖన్నా పాత్రను హిలేరియస్‌గా డిజైన్ చేశాడు. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన టైటిల్ సాంగ్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జులై 1, 2022న పక్కా కమర్షియల్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు జేక్స్ బీజాయ్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాకు ప్రేక్షకుల్ని ఆకర్షించేందుకు భారీగా టికెట్ రేట్లు తగ్గించింది యూనిట్. టైటిల్ లో పక్కా కమర్షియల్ అని ఉన్నప్పటికీ.. టికెట్ రేట్లు విషయంలో నాన్-కమర్షియల్ గా ఉన్నామంటూ ప్రచారం కూడా చేస్తున్నారు.

Next Story