Telugu Global
National

శివ‌సేన రెబల్ ఎమ్మెల్యేల‌కు బీజేపీ మ‌ద్ద‌తు.. – అస్సోం సీఎం

మహారాష్ట్ర రాజకీయాలు ఆసక్తికర మలుపులు తీసుకుంటున్నాయి. శివ‌సేన ఎమ్మెల్యేల‌ తిరుగుబాటు వెన‌క బీజేపీ ప్ర‌మేయం ఉన్న‌ట్టు స్ప‌ష్టమైంది. ఇప్ప‌టివ‌ర‌కూ `మ‌హా` సంక్షోభంతో త‌మ‌కు ఎటువంటి సంబంధం లేదంటూ బీజేపీ చెబుతూవ‌చ్చిన మాట‌ల‌న్నీ అబ‌ద్ధాలేన‌ని తేలిపోయింది. అస్సోం ముఖ్య‌మంత్రి హేమంత్ బిశ్వ శ‌ర్మ శనివారం నాడు ఈ విష‌యంపై స్ప‌ష్ట‌త‌నిచ్చారు. “అవును.. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు బీజేపీ మద్దతుంది. కానీ ఈ వ్య‌వ‌హారంతో నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను జోక్యం చేసుకోను. అతిథులుగా వచ్చిన వారిని గౌర‌వంగా […]

శివ‌సేన రెబల్ ఎమ్మెల్యేల‌కు బీజేపీ మ‌ద్ద‌తు.. – అస్సోం సీఎం
X

మహారాష్ట్ర రాజకీయాలు ఆసక్తికర మలుపులు తీసుకుంటున్నాయి. శివ‌సేన ఎమ్మెల్యేల‌ తిరుగుబాటు వెన‌క బీజేపీ ప్ర‌మేయం ఉన్న‌ట్టు స్ప‌ష్టమైంది. ఇప్ప‌టివ‌ర‌కూ 'మ‌హా' సంక్షోభంతో త‌మ‌కు ఎటువంటి సంబంధం లేదంటూ బీజేపీ చెబుతూవ‌చ్చిన మాట‌ల‌న్నీ అబ‌ద్ధాలేన‌ని తేలిపోయింది. అస్సోం ముఖ్య‌మంత్రి హేమంత్ బిశ్వ శ‌ర్మ శనివారం నాడు ఈ విష‌యంపై స్ప‌ష్ట‌త‌నిచ్చారు.

“అవును.. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు బీజేపీ మద్దతుంది. కానీ ఈ వ్య‌వ‌హారంతో నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను జోక్యం చేసుకోను. అతిథులుగా వచ్చిన వారిని గౌర‌వంగా చూసుకోవడం మా బాధ్యత “అని తేల్చి చెప్పారు అస్సోం సీఎం. ” ఉద్ద‌వ్ థాక్రే అయినా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అయినా మేము ఇలానే గౌర‌విస్తాం. వారుకూడా రావొచ్చు” అని అన్నారు.

గౌహ‌తిలో 200కు పైగా హోట‌ల్స్ ఉన్నాయి. వాటిలో ఎంతో మంది అతిథులు వ‌చ్చి ఉంటారు. మా రాష్ట్రంలో వ‌ర‌ద‌లు వ‌చ్చాయ‌ని వారంద‌ర్నీ వెళ్ళ‌గొట్ట‌లేం క‌దా! అని శ‌ర్మ అన్నారు. తాను మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ థాక్రేకు వ్య‌తిరేకంగా రెబల్స్ కార్య‌క‌లాపాల‌కు మ‌ద్ద‌తు ఇస్తూ ప్రోత్స‌హిస్తున్న‌ట్టు వ‌స్తున్న వార్త‌ల‌ను ఆయ‌న ఖండించారు. శ‌ర్మ వ్యాఖ్య‌ల‌తో మ‌హారాష్ట్ర తిరుగుబాటు ఎమ్మెల్యేల‌కు బీజేపీ మద్దతు ఉంద‌ని అధికారికంగా, బహిరంగంగా వెల్లడించినట్టైంది. తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే నేతృత్వంలో శివ‌సేన ఎమ్మెల్యేలు మొద‌ట గుజ‌రాత్‌లోని సూర‌త్‌కు, అక్క‌డి నుంచి గౌహ‌తికి చేరిన విష‌యం తెలిసిందే.

కాగా, షిండేతో స‌హా 16 మంది శివ‌సేన రెబ‌ల్‌ ఎమ్మెల్యేల‌కు డిప్యూటీ స్పీకర్ న‌ర‌హ‌రి అన‌ర్హ‌త నోటీసులు పంపారు. షిండే నేతృత్వంలో శివ‌సేన‌-బాల్‌థాక్రే పేరుతో కొత్త పార్టీని ప్ర‌క‌టించారు. అయితే దీనికి గుర్తింపురావాల్సి ఉంది. గౌహతిలో తిరుగుబాటు సేన నేతల క్యాంపింగ్‌ను ఖండించిన తృణ‌మూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వారిని పశ్చిమ బెంగాల్‌కు పంపించాలని అన్నారు. వాళ్లను, ప్రజాస్వామ్యాన్ని బాగా చూసుకుంటాం’ అని మమత అన్నారు. మమత ఆఫర్‌పై హిమంత బదులిస్తూ, అస్సోంకు వచ్చిన ‘లక్ష్మి’ని మమత తీసుకెళ్లాలనుకుంటున్నార‌ని వ్యాఖ్యానించారు.

First Published:  25 Jun 2022 7:38 AM GMT
Next Story