Telugu Global
National

బెంగళూరులో పెంపుడు కుక్కలకు పెరిగిన డిమాండ్.. ఎందుకంటే..?

బెంగళూరులో ఇప్పుడు పెంపుడు కుక్కలకు డిమాండ్ పెరిగింది. అది కూడా లాబ్రడార్ జాతి కుక్కలు మాత్రమే కావాలని అడుగుతున్నారట. బెంగళూరు నగరంతోపాటు ఇతర ప్రాంతాల్లో పెంపుడు కుక్కలను అమ్మేవారు.. డిమాండ్ భారీగా పెరిగినట్టు చెబుతున్నారు. లాబ్రడార్ జాతి కుక్కలను వేరే ప్రాంతాలనుంచి బెంగళూరుకు తెప్పిస్తున్నామన్నారు. అయితే దీనికి కారణం ఓ సినిమా కావడం విశేషం. ‘777 చార్లీ’ పేరుతో ఇటీవల ఓ కన్నడ సినిమా విడుదలైంది. ఈ సినిమా చూసిన కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కన్నీరు […]

బెంగళూరులో పెంపుడు కుక్కలకు పెరిగిన డిమాండ్.. ఎందుకంటే..?
X

బెంగళూరులో ఇప్పుడు పెంపుడు కుక్కలకు డిమాండ్ పెరిగింది. అది కూడా లాబ్రడార్ జాతి కుక్కలు మాత్రమే కావాలని అడుగుతున్నారట. బెంగళూరు నగరంతోపాటు ఇతర ప్రాంతాల్లో పెంపుడు కుక్కలను అమ్మేవారు.. డిమాండ్ భారీగా పెరిగినట్టు చెబుతున్నారు. లాబ్రడార్ జాతి కుక్కలను వేరే ప్రాంతాలనుంచి బెంగళూరుకు తెప్పిస్తున్నామన్నారు. అయితే దీనికి కారణం ఓ సినిమా కావడం విశేషం.

‘777 చార్లీ’ పేరుతో ఇటీవల ఓ కన్నడ సినిమా విడుదలైంది. ఈ సినిమా చూసిన కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కన్నీరు పెట్టుకోవడం కూడా అందరికీ తెలిసిందే. తన పెంపుడు కుక్క గుర్తొచ్చి ఆయన సినిమా హాల్ లోనే కన్నీటిపర్యంతమయ్యారు. దర్శకుడు కిరణ్ రాజ్ ని ఆయన మెచ్చుకున్నారు. దీంతో ఈ సినిమాకి మరింత పాపులార్టీ పెరిగింది, సూపర్ హిట్టైంది. అంతే కాదు, సినిమాలో లాబ్రడార్ డాగ్ ప్రధాన పాత్రధారి కావడంతో.. ఆ రకం కుక్కలకు బెంగళూరులో డిమాండ్ పెరిగింది.

సహజంగా.. గోల్డెన్ రిట్రీవర్, షిష్ జు అనే రకం కుక్కలను పెంచుకోవడం కోసం చాలామంది ఆసక్తి చూపిస్తుంటారని, అలాంటి వాటినే తాము అమ్ముతుంటామని చెబుతున్నారు షాపుల యజమానులు. అయితే ‘777 చార్లీ’ సినిమా విడుదల తర్వాత మాత్రం లాబ్రడార్ కుక్కలకు డిమాండ్ బాగా పెరిగింది.

‘పెటా’ ఏమంటుందంటే..
పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌ మెంట్ ఆఫ్ యానిమల్స్ (PETA) సంస్థ మాత్రం ఇలా ఒకే రకమైన కుక్కల కోసం ఎగబడటం సరికాదంటోంది. వీధి కుక్కలపై ప్రేమ చూపించాలని, వాటిని కూడా పెంచుకోవాలని చెబుతున్నారు PETA ప్రతినిధులు. గతంలో అమెరికాలో డిస్నీ సంస్థ ఇలాంటి ఓ సినిమా విడుదల చేసింది, అప్పట్లో డాల్మేషియన్ కుక్కలకు డిమాండ్ బాగా పెరిగింది. కానీ, ఆ తర్వాత వాటిని వదిలించుకోడానికే ఎక్కువమంది ప్రయత్నించారు.

జంతు సంరక్షణ శాలలకు వాటిని తరలించారని గుర్తు చేస్తున్నారు PETA ప్రతినిధులు. ఇప్పుడు కూడా అలానే జరుగుతుందని, కుక్కలను పెంచుకోవాలనే ఓపిక ఉన్నవారు.. వీధి కుక్కలను దత్తత తీసుకోవాలని సూచించారు. మొత్తమ్మీద ఒక్క సినిమాతో బెంగళూరులో చాలామందికి కుక్కలపై విపరీతమైన ప్రేమ పెరగడం మాత్రం విశేషం.

First Published:  25 Jun 2022 9:24 AM GMT
Next Story