Telugu Global
NEWS

జైకొట్టిన వైసీపీ..ఏపీ వరకు మొత్తం ఓట్లు బీజేపీకే.

రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి వైసీపీ మద్దతు ఇవ్వాలనుకుంటే.. ఇదే అదనుగా ప్రత్యేక హోదా లాంటి డిమాండ్లు ఉండాలని, కనీసం విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేయకుండా హామీనైనా సాధించాలని ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ వచ్చాయి. ఇప్పటి వరకు మౌనంగా ఉన్న వైసీపీ.. బేషరతుగా ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించింది. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఒక గిరిజన మహిళను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడం శుభపరిణామమని వైసీపీ ప్రకటించింది. సామాజిక […]

AP-YCP-BJP-NDA-Votes
X

రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి వైసీపీ మద్దతు ఇవ్వాలనుకుంటే.. ఇదే అదనుగా ప్రత్యేక హోదా లాంటి డిమాండ్లు ఉండాలని, కనీసం విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేయకుండా హామీనైనా సాధించాలని ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ వచ్చాయి. ఇప్పటి వరకు మౌనంగా ఉన్న వైసీపీ.. బేషరతుగా ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించింది.

దేశ చరిత్రలోనే తొలిసారిగా ఒక గిరిజన మహిళను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడం శుభపరిణామమని వైసీపీ ప్రకటించింది. సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తున్న వైసీపీ.. గిరిజన మహిళ ముర్ముకు మద్దతు ఇస్తోందని వెల్లడించింది. రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము నామినేషన్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కూడా హాజరుకావాలనుకున్నారని.. కానీ ముందే నిర్ణయించిన కేబినెట్‌ సమావేశం కారణంగా ఆయన రాలేకపోతున్నారని వైసీపీ వివరణ ఇచ్చింది. నామినేషన్ కార్యక్రమానికి వైసీపీ తరఫున మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి హాజరవుతారని వైసీపీ వెల్లడించింది.

కేరళ నుంచి బీజేపీ అభ్యర్థి ముర్ముకు ఒక్క ఓటు కూడా పడే అవకాశం లేదు. అక్కడ ఓట్లున్న అన్ని పక్షాలు ఎన్‌డీఏకు వ్యతిరేకమే. ఏపీలో మాత్రం అధికార, విపక్షం ఎగబడి బీజేపీ అభ్యర్థికి ఓటేయబోతున్నాయి. దాంతో ఏపీ వరకు ఎన్‌డీఏ అభ్యర్థి మొత్తం ఓట్లను సొంతం చేసుకునే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా ఒత్తిళ్లు తెస్తున్నప్పటికీ తెలంగాణలో అధికార పార్టీ టీఆర్‌ఎస్ మాత్రం ధైర్యంగా బీజేపీ- ఎన్‌డీఏ అభ్యర్థికి వ్యతిరేకంగానే ఓటేయబోతోంది.

First Published:  23 Jun 2022 8:55 PM GMT
Next Story